- ఓర్లాండో విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం
- విమానంలో మంటలు.. తప్పిన భారీ ముప్పు
- సురక్షితంగా ప్రయాణికులను దించేసిన సిబ్బంది

అమెరికాలోని ఓర్లాండో విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ సిద్దపడుతుండగా ఒక్కసారిగా ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది.. ప్రయాణికులను ఎమర్జెన్సీ స్లయిడ్స్ ద్వారా వెంటనే కిందకు దించేశారు. దీంతో పెద్ద ముప్పు తప్పింది. ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka : గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి చాలా కారణాలున్నాయ్..
సోమవారం ఉదయం 11:15 నిమిషాలకు ఎయిర్‌బేస్ ఏ330 విమానం 282 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లతో హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం బయలుదేరే సమయంలో ఇంజన్‌లో మంటలు చెలరేగాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నివేదించింది. ప్రమాదానికి గల కారణమేంటో తెలియలేదని పేర్కొంది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా మరొక విమానం ఏర్పాటు చేసి పంపించినట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: AP SSC Results 2025: రేపు పదో తరగతి ఫలితాలు విడుదల.. వాట్సప్‌లోనూ రిజల్ట్స్!
A Delta flight just caught on fire at the Orlando Airport 😳 pic.twitter.com/kmksyx5QIu
— Dylan (@dylangwall) April 21, 2025