- హైదరాబాద్ లోని మహేశ్వరం జోన్‌లో ఘోర ఘటన
- యాక్సిడెంట్ ముసుగులో హత్య
- హత్యకు సంబంధించి ఐదుగురి అరెస్టు.

Maheshwaram: హైదరాబాద్ లోని మహేశ్వరం జోన్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనను మొదట యాక్సిడెంట్‌గా అనుమానించిన పోలీసులు, ఆ తర్వాత దర్యాప్తులో ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా తేల్చారు. భూతగాదాల వివాదం కారణంగా శంకరయ్య అనే వ్యక్తిని ప్రత్యర్థులు పక్క ప్లాన్ ప్రకారం హత్య చేశారు. శంకరయ్యను టార్గెట్ చేసిన నిందితులు.. అతను బైక్‌పై వెళ్తున్న సమయంలో కారుతో ఢీకొట్టి చంపారు. ఈ ఘటనను యాక్సిడెంట్‌గా మారుస్తూ తప్పుడు దిశగా మళ్లించే ప్రయత్నం చేశారు నిందితులు. అయితే సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ఈ ప్రమాదం పక్కాగా ప్లాన్ చేసి చేసిన హత్య అని గుర్తించారు.
Read Also: Shubman Gill: సిరాజ్ సూపర్.. బ్యాటర్ల కంటే బౌలర్లే గేమ్ ఛేంజర్లు!
దీంతో కేసును లోతుగా విచారించిన మహేశ్వరం పోలీసులు.. ఈ హత్యకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. అలాగే హత్యకు ఉపయోగించిన రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. భూ వివాదాల నేపథ్యంలో ఇది పక్క ప్రణాళికతో జరిగిన హత్య అని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తూ, మిగిలిన వివరాలు వెలికితీయడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో మహేశ్వరం ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది.