DC vs RR Preview: ఐపీఎల్ (IPL) 2025 ఉత్కంఠగా సాగుతోంది. ఈ సీజన్‌లో భాగంగా 32వ మ్యాచ్ ఏప్రిల్ 16న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ డీసీ సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటివరకు రెండు జట్ల ప్రయాణం గురించి మాట్లాడుకుంటే.. ఒక వైపు, ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, 1 మ్యాచ్‌లో మాత్రమే ఓటమి పాలైంది. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ 6 మ్యాచ్‌ల్లో 4 ఓడిపోయి, 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది.
అయితే, రెండు జట్లు తమ గత మ్యాచ్‌లలో ఓటమిని చవిచూడడం గమనార్హం. ముంబై ఇండియన్స్‌తో జరిగిన భారీ స్కోరుతో ఢిల్లీ ఓడిపోయింది. ఒక దశలో ఢిల్లీ క్యాపిటల్స్ సులభమైన విజయాన్ని నమోదు చేస్తుందని అనిపించింది. కానీ, చివరి ఓవర్లలో వరుస రనౌట్లు రావడంతో ఢిల్లీ జట్టు విజయం చేతుల్లోంచి జారిపోయింది. కాగా, రాజస్థాన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించింది. బెంగళూరుపై రాజస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ రెండూ తీవ్రంగా నిరాశపరిచాయి. ఇటువంటి పరిస్థితిలో, ఇప్పుడు ఢిల్లీ, రాజస్థాన్ రెండూ విజయాల బాట పట్టేందుకు చూస్తున్నాయి.
IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ హెడ్ టు హెడ్ గణాంకాలు..
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య చాలా కఠినమైన పోటీ ఉంది. ఇప్పటివరకు ఆ రెండు జట్ల మధ్య మొత్తం 29 మ్యాచ్‌లు జరగగా, ఢిల్లీ 14 సార్లు, రాజస్థాన్ 15 సార్లు గెలిచింది. ఐపీఎల్ 2024 సమయంలో ఇరుజట్ల చెరో మ్యాచ్ గెలిచాయి.
DC vs RR మ్యాచ్‌లో గెలుపు ఎవరిది?
ఐపీఎల్ 2025లో భాగంలో 32వ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో అంచనా వేస్తే, ఢిల్లీ క్యాపిటల్స్ పైచేయి సాధిస్తుందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం ఇప్పటివరకు ఢిల్లీ బ్యాటర్ల ప్రదర్శనతోపాటు బౌలర్లు కూడా ఆకట్టుకుంటున్నారు. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ యూనిట్ ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ కారణంగా ఢిల్లీ విజయం సాధిస్తుందని చెప్పవచ్చు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..