- ఢిల్లీ – రాజస్థాన్ మ్యాచ్ ఉత్కంఠగా టై
- ఐపీఎల్ 2025లో తొలి సూపర్ ఓవర్ థ్రిల్లర్
- సూపర్ ఓవర్‌లో విజయం ఢిల్లీ క్యాపిటల్స్‌దే

DC vs RR : ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఊహించని ఉత్కంఠను అందించింది. రెండు జట్లు సమానంగా 188 పరుగులు చేసి స్కోరులో టై అయిన వేళ, మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇది 2021 తర్వాత ఐపీఎల్‌లో జరిగిన తొలి సూపర్ ఓవర్ కావడం విశేషం. ప్రధాన ఇన్నింగ్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ కూడా సమాన రీతిలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్ దశకు తీసుకెళ్లింది.
సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్, ఢిల్లీ బౌలింగ్ ఎదుర్కోలేక 6 బంతుల్లో కేవలం 11 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు లక్ష్య ఛేదనలో విశ్వరూపం చూపించారు. కేవలం 4 బంతుల్లోనే 13 పరుగులు చేసి సూపర్ ఓవర్‌లో గెలుపు సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ కీలకమైన రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. సీజన్‌లో ఇది మొదటి సూపర్ ఓవర్ కావడం, అలాగే మ్యాచ్ అంతా చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగడం అభిమానులకు నచ్చిన అంశాలుగా నిలిచాయి.
Off The Record : సీఎం రేవంత్ ఎవరికి క్లాస్ పీకారు? ఎవరినుద్దేశించి హాట్ కామెంట్స్?