Axar Patel and Ajinkya Rahane Injured: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా 48వ మ్యాచ్‌లో, రెండు జట్ల కెప్టెన్లు గాయపడ్డారు. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్, కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే ఇద్దరి చేతులకు గాయాలయ్యాయి. మ్యాచ్ తర్వాత, ఇద్దరు స్టార్లు తమ గాయాల గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ జట్టు 14 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఫీల్డ్ చేస్తున్నప్పుడు అక్షర్ వేలికి గాయమైంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో, రోవ్‌మన్ పావెల్ బంతిని మిడ్-వికెట్ వైపు బలంగా కొట్టాడు. ఢిల్లీ కెప్టెన్ బంతిని పట్టుకునేందుకు డైవ్ చేశాడు. ఈ క్రమంలో అక్షర్ వేలికి గాయమైంది. ఆ తర్వాత అతనికి మైదానంలో ఫిజియో చికిత్స అందించారు. మ్యాచ్ తర్వాత, అక్షర్ తన గాయం గురించి మాట్లాడుతూ, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నొప్పిగా ఉందని, తదుపరి మ్యాచ్ నాటికి తాను కోలుకోవాలని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు.
‘బంతిని ఆపడానికి డైవ్ చేస్తున్నప్పుడు, నా చేయి నేలపైకి గట్టిగా తగిలింది. నా చర్మంపై గాయాలయ్యాయి. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బ్యాట్ హ్యాండిల్ నాకు తగిలి నొప్పిగా అనిపించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు మాకు మూడు-నాలుగు రోజుల సమయం ఉంది. కాబట్టి, నేను బాగానే ఉంటానని ఆశిస్తున్నాను’ అంటూ అక్షర్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
అక్షర్ పటేల్ తర్వాత, రహానే కూడా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన కారణంగా రహానే మైదానం వదిలి వెళ్ళవలసి వచ్చింది. తన గాయం గురించి రహానే మాట్లాడుతూ- ఇది అంత తీవ్రమైనది కాదు. నేను బాగున్నాను’ అని తెలిపాడు.
రహానే షార్ట్ కవర్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. రస్సెల్ వేసిన ఓవర్ మూడో బంతికి ఫాఫ్ డు ప్లెసిస్ ఎక్స్‌ట్రా కవర్ వైపు షాట్ ఆడాడు. రహానే బంతిని ఆపాడు. కానీ, దానిని సరిగ్గా పట్టుకోలేకపోయాడు. దీని కారణంగా అతని వేలికి గాయమైంది. అతని చేతి నుంచి రక్తం కారడం మొదలైంది. అతను మైదానం వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత అతను తిరిగి మైదానంలోకి రాలేదు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..