
కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ఉండే ఒక ముఖ్యమైన కొవ్వు పదార్థం. శరీరం దాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం వాడుతుంది. కానీ అది అధికంగా ఉన్నప్పుడు గుండె సమస్యలు, రక్తపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అధిక కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి హానికరం కావడంతో పాటు ఇతర రోగాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను సహజంగా తగ్గించుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే కొన్ని డ్రింక్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసం, అల్లం
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి నిమ్మ అల్లం నీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. నిమ్మలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. ఇవి రక్తంలో లిపిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి. నిమ్మ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా దోహదపడుతుంది. అల్లం యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండివుంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గించడంలో, కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహకరిస్తుంది. రోజూ ఈ నీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
ద్రాక్ష, రోజ్ మేరీ
ద్రాక్షలో నరింగెనిన్ అనే సహజ పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వు కణాలను కరిగించడంలో సహాయపడుతుంది. ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజ్ మేరీ అనే మొక్కలో యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడం ద్వారా ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ద్రాక్ష, రోజ్ మేరీ కలిపి తీసిన ఈ నీరు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆరెంజ్, పసుపు నీరు
ఆరెంజ్‌లో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి రక్తంలో లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతాయి. పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంది. ఇది శరీరంలో మంటను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ డ్రింక్ అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.
కీర దోసకాయ, పుదీనా
కీర దోసకాయలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది. పుదీనాలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఈ డ్రింక్ తాగడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవచ్చు. అలాగే శరీరంలోని అసమతుల్యతలను సరిచేయడంలో కూడా ఇది సహాయపడుతుంది.
ఆపిల్, దాల్చిన చెక్క
ఆపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వు లిపిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి. దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. ఆపిల్, దాల్చిన చెక్క కలిపి తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు సహజంగా తగ్గుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)