ABN
, Publish Date – Mar 23 , 2025 | 04:19 AM
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించడానికి ఏపీఐఐసీ నిరాకరిస్తోందని, కమీషన్లు ఇచ్చేవారికి మాత్రమే భూములు కేటాయిస్తోందని

ఏపీఐఐసీపై దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఆరోపణ
అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించడానికి ఏపీఐఐసీ నిరాకరిస్తోందని, కమీషన్లు ఇచ్చేవారికి మాత్రమే భూములు కేటాయిస్తోందని దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మామిడి సుదర్శన్ ఆరోపించారు. 2017, 2018లలో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన పార్టనర్‌షిప్ సమ్మిట్‌లలో ఎంవోయూ చేసుకున్నవారికి ఇప్పటికీ భూములు కేటాయించలేదన్నారు. అప్పట్లో తమ అసోసియేషన్ కూడా రాష్ట్రంలో రూ.600 కోట్ల పెట్టుబడులతో 800 ఎకరాల్లో నాలుగు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందన్నారు. ఒప్పందాలు చేసుకున్నవారిలో ఎవరెవరికి భూములు కేటాయించారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఒప్పందం ప్రకారం భూములు కేటాయించేలా సీఎం దృష్టి సారించాలని కోరారు.
Updated Date – Mar 23 , 2025 | 04:19 AM