Curd after lunch benefits: వేసవిలో అనే కాదు. ఏ సీజన్లో అయినా ఆహారంలో పెరుగు ఒక ముఖ్యమైన భాగం. కొంతమందికి మజ్జిగలా చేసుకుని తాగడానికి ఇష్టపడితే.. మరికొంతమంది లస్సీలా చేసుకుని తాగుతుంటారు. నేరుగా పెరుగు ఒక్కటే తినడం నచ్చనివారు రైతా చేసుకుంటారు. పెరుగులో చాట్ మసాలా వేసుకుని తినేవారూ ఉంటారు. ఇలా ఎన్నో విధాలుగా పెరుగును రోజూవారీ ఆహారంలో భాగం చేసుకుంటారు. ఇదెలా ఉంటే, వేసవిలో పెరుగు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Benefits of eating curd) ఉన్నాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా సంకోచం లేకుండా పెరుగు తినాలని వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు. అయితే, భోజనం తర్వాత పెరుగు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా? లేదా కీడు చేస్తుందా? ఆ వివరాలు ఈ కథనంలో..
భోజనం తర్వాత పెరుగు తినాలా? వద్దా?
భోజనం తర్వాత రోజూ పెరుగు తినవచ్చని డైటీషియన్లు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.దీన్ని తినడం వల్ల లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియం వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా తగ్గుతుంది. దీనితో పాటు మన శరీరంలోని వాపు సమస్యలకు చెక్ పెడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారంతో పెరుగు కలిపి తింటే మరిన్ని లాభాలుంటాయి.
పెరుగు తించే శరీరం చల్లబడుతుందా?
పెరుగు తిన్నాక కడుపుకు ఉపశమనం, చల్లదనం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే, పెరుగు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుందనేందుకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ పెరుగులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. అందువల్ల ఇది తిన్న తర్వాత శరీరం హైడ్రేటెడ్‌గా మారి తాజా భావనను కలిగిస్తుంది.
భోజనం తర్వాత పెరుగు తింటే కలిగే ప్రయోజనాలు..
ప్రతిరోజూ భోజనం తర్వాత పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. పెరుగు తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్యను పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చు. ఇది మన శరీరానికి కావల్సినంత నీటిని అందిస్తుంది.పేగులో వచ్చే మంటను నియంత్రణలో ఉంచుతుంది.
Note: పైన పేర్కొన్న వివరాలు ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఆరోగ్య సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఏదైనా ఆహారం తినేముందు వైద్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.
Read Also: Summer Superfood: పీఎం మోదీ ఏడాదిలో 300 రోజులు తినే మఖానా స్పెషల్ రెసిపీ ఇదే..
Health Tips: ఈ పదార్థాల్లో ఉప్పు కలిస్తే విషంతో సమానం.. పొరపాటున కూడా తినకండి..
Skin Care: తమలపాకుతో గ్లోయింగ్ స్కిన్.. ఈ 3 చర్మ సమస్యలు కూడా పోతాయ్..