CUET PG 2025 Exam Date: సీయూఈటీ పీజీ ఆన్‌లైన్‌ పరీక్షల తేదీలు ఇవే.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు

Written by RAJU

Published on:

న్యూఢిల్లీ, మార్చి 9: కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) పీజీ 2025 పరీక్షలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సరిగ్గా నాలుగు రోజుల ముందు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) అడ్మిట్‌ కార్డులు విడుదల చేసింది. అభ్యర్ధులు తమ అప్లికేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా మార్చి 13, 15, 16, 18, 19 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో సీయూఈటీ పీజీ 2025 పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్‌ కార్డులపై అభ్యర్థుల పోటో, సంతకం, బార్‌కోడ్‌లో తప్పులు వస్తే తిరిగి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.

ఇక ఇప్పటికే అకాడమిక్ సెషన్ 2025-26 కోసం సీయూఈటీ పీజీ పరీక్షల షెడ్యూల్‌ను ఎన్‌టీఏ విడుదల చేసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మార్చి 13 నుంచి మార్చి 20వ తేదీ వరకు మూడు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 157 సబ్జెక్టుల్లో జరిగే సీయూఈటీ పీజీ 2025 ర్యాంకు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తారు. వీటిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి.

సీయూఈటీ పీజీ 2025 అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ డీఎడ్ ఫలితాలు వచ్చేశాయ్‌.. రీకౌంటింగ్ గడువు ఇదే!

తెలంగాణ డీఎడ్ (డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) మొదటి సంవత్సరం ఫతితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. మార్చి 24వ తేదీ లోపు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని అధికారులు తెలిపారు.

తెలంగాణ డీఎడ్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Subscribe for notification