
కీరదోస ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది. కీరదోసలోని పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం. రోజూ కప్పు కీరదోస రసం తాగితే మేని నిగారింపు సంతరించుకుంటుంది. కీరదోసలో విటమిన్- ఎ, సిలు పుష్కలంగా లభిస్తాయి. ఇవేకాకుండా వేసవిలో ప్రతి రోజూ కీరదోస జ్యూస్ తాగటం వల్ల శరీరంలో కలిగే మార్పులేంటో చూద్దాం.
కీరదోస జ్యూస్ మంచి డిటాక్స్ డ్రింక్‌లా కూడా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం పరగడుపునే ఈ జ్యూస్ తాగితే శరీరంలోని వ్యర్థాలన్నీ సులభంగా బయటికి పోతాయి. శరీరం శుభ్రంగా మారుతుంది. అనేక వ్యాధుల నుంచి మనకు రక్షణగా ఉంటుంది. కీరదోస జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల శరీరంలో ఉండే అధిక కొవ్వు కరుగుతుంది. బరువు కూడా తొందరగా తగ్గుతారు. పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కూడా ఇట్టే కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయులకు కీరదోస జ్యూస్ చాలా ఉపయోగకరం. కాబట్టి ప్రతిరోజు దీన్ని తీసుకుంటే మంచిది. అంతేకాకుండా వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. వడదెబ్బ బారిన పడకుండా కాపాడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.
కీరదోసలో విటమిన్ కె అధికంగా ఉండటం వల్ల గాయాలు అయిన వెంటనే రక్తస్రావం కాకుండా రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. కీరదోసలోని మెగ్నీషియం నిద్రబాగా పట్టేలా చేస్తుంది. శరీరానికి ఎంతో రిలాక్సేషన్ ఇస్తుంది. దీంతో నిద్రలేమి సమస్యల నుంచి బయటపడొచ్చు. ఇందులోని పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. మన శరీరంలోని చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. దీని వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు కూడా మన దరిచేరవు. కీరదోసలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా అజీర్ణం,గ్యాస్, మలబద్ధకాన్ని పోగొడుతుంది. అదేవిధంగా కీరలోని విటమిన్ సి మన ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది. వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..