- టాస్‌గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్..
- చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మ్యాచ్
- మొదట బ్యాటింగ్ చేయనున్న సీఎస్కే.

CSK vs PBKS: నేడు చెన్నై లోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడే చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలని చూస్తుంది. రెగ్యులర్ కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ గాయం తర్వాత కూడా ఎంఎస్ ధోని నాయకత్వంలో చెన్నై ప్రదర్శన ఏమి మారలేదు. సీఎస్కే జట్టు ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇక మరోవైపు, పంజాబ్ కింగ్స్ జట్టు చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కారణంగా జట్టు పాయింట్లను పంచుకోవలసి వచ్చింది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత కూడా చెన్నై జట్టులో ఎలాంటి మార్పులు చేపట్టలేదు. ఇక వేలు ఫ్రాక్చర్ కారణంగా గ్లెన్ మాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు. మరి నేటి మ్యాచ్ ప్లేయింగ్ XI ఎలా ఉందొ చూద్దామా..
Read Also: Meerut: భర్త “గడ్డం” తీయనందుకు, మరిదితో లేచిపోయిన మహిళ..
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI:
ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఉమర్జాయ్, సూర్యంష్ షెడ్గే, యుజ్‌వదీప్ చాహల్.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జావియర్ బార్ట్లెట్, ప్రవీణ్ దూబే, ముషీర్ ఖాన్, విజయ్‌కుమార్ వైశాక్
Read Also: Pakistan: పీఓకే, గిల్గిత్‌కి అన్ని విమానాలు రద్దు.. పాక్ ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్..
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI:
షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, MS ధోని (వికెట్ కీపర్/కెప్టెన్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్
ఇంపాక్ట్ ప్లేయర్స్:
అన్షుల్ కంబోజ్, ఆర్. అశ్విన్, జెమీ ఓవర్టన్, కమలేశ్ నాగర్‌కోటీ, రామకృష్ణ ఘోష్