ఐపీఎల్ 2025లో రవిచంద్రన్ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. అలాగే అశ్విన్‌కు ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఆ ఛానెల్ నుంచి ఒక షాకింగ్ స్టేట్‌మెంట్ వచ్చింది. అదేంటంటే.. ఇకపై చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లకు సంబంధించి ఎలాంటి విశ్లేషణలు, వీడియోలు చేయమంటూ వెల్లడించింది. మరి ఇందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 2020లో అశ్విన్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాడు. క్రికెట్‌కు సంబంధించి మ్యాచ్ విశ్లేషణలు చేస్తూ.. పలు విషయాలపై తాను స్పందిస్తూ, తన అభిప్రాయాలు, అలాగే ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉంటాడు.
పలువురిని ఇంటర్వ్యూ కూడా చేశాడు. తాజాగా ఐపీఎల్‌కు సంబంధించి అతని టీమ్ మ్యాచ్‌లను విశ్లేషిస్తోంది. గత వారం ఛానెల్‌లో పోస్ట్ చేసిన అశ్విన్ వీడియోలలో ఒకదానిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ డేటా విశ్లేషకుడు ప్రసన్న అగోరం మాట్లాడుతూ.. సీఎస్‌కే టీమ్‌లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి సీనియర్ బౌలర్లు ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన నూర్ అహ్మద్‌ను ఆడించడంపై విమర్శలు చేశాడు. ఆ తర్వాత ఆర్సీబీ, ఢిల్లీ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలు కావడంతో అగోరం వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాది. ఇదే విషయంపై సీఎస్‌కే హెడ్ కోచ్‌ను ప్రశ్నించినప్పుడు.. అశ్విన్‌కు యూట్యూబ్ ఛానెల్ ఉన్న విషయం కూడా తనకు తెలియదని, ఇప్పుడది అసంబద్ధం అంటూ పేర్కొన్నాడు.
ఆ తర్వాత అశ్విన్ యూట్యూబ్ ఛానెల్ నుంచి ఆ వీడియోను తొలగించారు. ఇప్పుడు తాజాగా సీఎస్‌కే మ్యాచ్‌లకు సంబంధించి ఎలాంటి విశ్లేషలను చేయబోమంటూ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్ అడ్మిన్ వెల్లడించాడు. ఐపీఎస్ సీజన్ ముగిసే వరకు సీఎస్‌కే గురించి ఎలాంటి విషయాలు చర్చించడం లేదంటూ పేర్కొన్నారు. ఆల్రెడీ ఆ టీమ్‌లో అశ్విన్ ఆడుతున్నాడు కాబట్టి, ఆ టీమ్‌కు సంబంధించి తన యూట్యూబ్ ఛానెల్‌లో విమర్శలు చేయడం, వాళ్లు స్ట్రాటజీని ప్రశ్నించడం సరికాదనే విమర్శలు వచ్చాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
🚨 PRESS NOTE BY ASHWIN’s YOUTUBE CHANNEL 🚨
– Ashwin’s Youtube Channel won’t be covering CSK matches in IPL 2025. pic.twitter.com/rBoox0ZUVe
— Johns. (@CricCrazyJohns) April 7, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..