CSIR: హైదరాబాద్‌లో సీఎస్ఐఆర్ స్టార్టప్‌ కాన్‌క్లేవ్‌

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Apr 07 , 2025 | 05:00 AM

పరిశోధన సంస్థలు, స్టార్ట్‌పల మధ్య సహకారాన్ని సులభతరం చేయడం, భారత్‌లో ఆంత్రప్రెన్యూర్‌షి్‌పను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్‌లో సీఎస్ఐఆర్ స్టార్టప్‌ కాన్‌క్లేవ్‌ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

CSIR: హైదరాబాద్‌లో సీఎస్ఐఆర్ స్టార్టప్‌ కాన్‌క్లేవ్‌

  • ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహణ

  • దేశంలో ఆంత్రప్రెన్యూర్‌షి్‌పను ప్రోత్సహించడమే లక్ష్యం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): పరిశోధన సంస్థలు, స్టార్ట్‌పల మధ్య సహకారాన్ని సులభతరం చేయడం, భారత్‌లో ఆంత్రప్రెన్యూర్‌షి్‌పను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్‌లో సీఎ్‌సఐఆర్‌ స్టార్టప్‌ కాన్‌క్లేవ్‌ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎ్‌సఐఆర్‌కు చెందిన సంస్థలు ఐఐసీటీ, ఎన్‌జీఆర్‌ఐ, సీసీఎంబీ డైరెక్టర్లతో కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సీఎ్‌సఐఆర్‌-ఐఐసీటీ, సీఎ్‌సఐఆర్‌-ఎన్‌జీఆర్‌ఐ, సీఎ్‌సఐఆర్‌-సీసీఎంబీ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించనున్నాయి.

ఔషధ ఆవిష్కరణ, జన్యు నిర్ధారణలో హైదరాబాద్‌కు చెందిన సీఎ్‌సఐఆర్‌ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రశంసించారు. శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణలు, ఆంత్రప్రెన్యూర్‌షి్‌పకు హైదరాబాద్‌ వేదికగా నిలుస్తోందన్నారు. ఐఐసీటీ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌, సీసీఎంబీ డైరెక్టర్‌ వినయ్‌ నందికూరి సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date – Apr 07 , 2025 | 05:00 AM

Google News

Subscribe for notification
Verified by MonsterInsights