ABN
, Publish Date – Apr 22 , 2025 | 08:58 AM
హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త హేమరాజు ఇంట్లో బంగారు ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదు ఎత్తుకుపోయారు. ఇంట్లో పని మనుషులు వ్యాపారవేత్త హేమరాజు దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. అది తిన్న దంపతులిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

Crime News
హైదరాబాద్: నగరంలోని కాచిగూడ (Kachiguda)లో ఓ వ్యాపారవేత్త (Kachiguda) ఇంట్లో భారీ చోరీ (Robbery) జరిగింది. వ్యాపారవేత్త దంపతులకు మత్తుమందు (Drugged) ఇచ్చి ఇంట్లో ఉన్న నగదు, నగలు తీసుకుని పరిపోయారు. ఇంట్లో పనిమనుషులే ఈ దోపిడీకి పాల్పడ్డారు. వ్యాపారవేత్త హేమరాజ్ ఇంట్లో రెండు కిలోల బంగారం ఆభరణాలు (2 kg gold stolen), రూ. మూడు కోట్ల నగదు (Rs 3 crore cash) చోరీ చేశారు. మత్తు మందుతో కూడిన భోజనం తిని హేమరాజ్ దంపతులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ దంపతులు స్పృహ కోల్పోయిన వెంటనే ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోపిడీ చేశారు.
Also Read..: సినీ హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు
అయితే మంగళవారం ఉదయం వాకింగ్‌కు వ్యాపారవేత్త హేమ రాజు రాకపోవడంతో అతని స్నేహితుడు ఇంటికి వచ్చాడు. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న హేమరాజు దంపతులను అతను ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి నుంచి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన పని మనుషులు (నేపాలి దంపతులు) కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
గరిష్ఠ స్థాయిల్ని తాకుతోన్న పసిడి..
కుమార్తె అలా చేయడం వల్లే.. హత్యకు గురైన మాజీ డీజీపీ..
For More AP News and Telugu News
Updated Date – Apr 22 , 2025 | 08:58 AM