India US Trade Deal: ఇండియా – యూఎస్ మధ్య పూర్తి స్థాయి ట్రేడ్ డీల్ త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసే మొదటి దేశం భారతదేశం కావచ్చని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ అన్నారు. ఇండియాలో దేశీయ వినియోగం బాగా పెరుగుతుండటంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మంచిగా పురోగమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ మూలధన వ్యయం.. అలాగే పన్నుల సంస్కరణలు ప్రైవేట్ పెట్టుబడుల పెరుగుదలకు దోహదపడ్డాయని.. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్-అమెరికా వాణిజ్య చర్చలు పూర్తి ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొన్న బెసెంట్.. వాషింగ్టన్తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన రెసిప్రోకల్ టారిఫ్స్ (పరస్పర సుంకాలు)ను నివారించడానికి న్యూఢిల్లీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. “భారతీయులతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సులభం” అని చెప్పిన బెసెంట్.. పరస్పర సంఘీభావంతో రంగాల వారీగా సుంకాల విషయంలో ఇరు దేశాలు ముందుకెళ్తాయని చెప్పారు.
అమెరికా, గతంలో భారతదేశంపై 26 శాతం సుంకాన్ని విధించింది. చైనా మినహా మెజారిటీ దేశాలపై కొత్త సుంకాలు విధించడాన్ని ట్రంప్ 90 రోజుల పాటు నిలిపివేసిన తర్వాత ఇది నిలిచిపోయింది. అయితే, భారతదేశం ప్రస్తుతం అమెరికా నుండి 10 శాతం సుంకానికి లోబడి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల, స్టాక్ మార్కెట్ కంపెనీ అయిన ACMIIL నివేదిక ప్రకారం, రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలకు భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) ఒక నమూనాగా ఉండే అవకాశం ఉందని చెబుతోంది.
అంతేకాదు, భారత్-అమెరికా కొత్త వాణిజ్య ఒప్పందం భారతదేశ వాణిజ్య వ్యూహంలో గణనీయమైన మార్పును సూచిస్తుందని నివేదిక పేర్కొంది. ఎందుకంటే ఇది అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను పొందేందుకు, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని బలోపేతం చేయడానికి భారత్ కు ఒక సాధనంగా ఉపయోగపడుతుందని సదరు నివేదిక స్పష్టం చేస్తోంది.
అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా, భారతదేశం ఎగుమతి చేసే వ్యవసాయ, ఆహార ఉత్పత్తులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉంది. భారతదేశం, ప్రతిగా, రక్షణ వంటి కీలకమైన రంగాలలో అధునాతన US సాంకేతిక పరిజ్ఞానాలను దిగుమతి చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతుంది. ఈ రంగాలు భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు అలాగే జాతీయ భద్రతా ప్రణాళికలకు కీలకమైనవి.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ప్రయాణికులకు విమానయాన సంస్థలు కీలక సూచన
Pahalgam Terror Attack: దేశం వీడుతోన్న పాకిస్థానీయులు..
Pahalgam terror attack: ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో మృతి చెందిన లెఫ్టినెంట్ భార్యపై కామెంట్లు.. నిందితుడు అరెస్ట్
For National News And Telugu News
Pahalgam Terror Attack: ఉగ్రవాదుల వివరాలందిస్తే.. భారీ నజరానా
Updated Date – Apr 25 , 2025 | 04:11 PM