ఇంటర్నెట్ డెస్క్: కొందరు కాఫీ తాగనిదే పనిలోకి దిగలేదు. కాఫీ కడుపులో పడకపోతే ఉత్సాహం రాదంటారు. కానీ ఒక్కోసారి కాఫీ తాగాక కూడా నిస్సత్తువగానే అనిపిస్తుంది. ఈ పరిస్థితి రావడానికి పెద్ద కారణమే ఉందని నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగే అలవాటు ఉన్న వారిలో దీర్ఘకాలంలో డీహైడ్రేషన్ తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు (Coffee Dehydration).
‘‘కాఫీ సాధారణంగా ఆరోగ్యానికి మంచిదే. కానీ దీని వల్ల డీహైడ్రేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి, ఒంట్లో తేమ శాతం తగినంత ఉండేందుకు కాఫీ తాగక ముందు లేదా ఆ తరువాత నీళ్లు తాగాలట.
Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలోకు రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా
కాఫీలోని కెఫీన్ అనే రసాయనం మూత్ర విసర్జన అధికంగా జరిగేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో, ఒంట్లోని నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం పెరుగుతుంది. కాబట్టి కాఫీ తాగాక లేదా తాగక ముుపు ఇతర పానీయాలు తప్పనిసరిగా తాగాలి. ఇలా తాగే పానీయాల్లో యాంటీఆక్సిడెంట్స్ ఉండేలా జాగ్రత్త పడితే మరింత మేలు జరుగుతుంది. ఇందు కోసం వివిధ రకాల పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, బటర్ మిల్క్ వంటి వాటిని కాఫీకి జతగా తాగొచ్చు.
Coconut water High Potassium: కొబ్బరి నీళ్లతో ఇలాంటి రిస్కులు కూడా ఉంటాయి జాగ్రత్త!
కాఫీతో కలిగే డీహైడ్రేషన్ వల్ల నీరసంగా అనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇక కాఫీతో పాటు శరీరంలో చేరే చక్కెర కారణంగా ఒంట్లో షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఈ అలవాటు ఉన్న వారిలో కాఫీ ప్రభావం రానురాను తగ్గిపోతుంది. అందుకే, కాఫీ తాగినా ఎటువంటి ఫలితం లేనట్టు అనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి, కాఫీ వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే కాఫీ తాగే ముందు ఒక బాటిల్ నీళ్లు, ఆ తరువాత మరో బాటిల్ నీళ్లు తాగితే నీరసంగా అనిపించదు. ఈ జాగ్రత్తలు పాటించే వారు హ్యాపీగా కాఫీ రుచిని ఆస్వాదించొచ్చని చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఫార్ములాను మీరూ ఫాలో అయిపోండి.
Vitamin D Deficiency Causes: సప్లిమెంట్స్ తీసుకున్నా విటమిన్ డీ లోపమా.. కారణాలు ఇవే..
Read Latest and Health News