- పాక్ మీడియాలో సంచలనంగా సీఎం సిద్ధరామయ్య కామెంట్స్..
- ‘‘పాకిస్తాన్‌తో యుద్ధం వద్దంటు కామెంట్స్’’..
- సిద్ధరామయ్య ‘‘పాకిస్తాన్ రత్న’’అంటూ బీజేపీ సెటైర్లు..

CM Siddaramiah: కాంగ్రెస్ నేత, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాకిస్తాన్ వ్యాప్తంగా హెడ్‌లైన్‌గా నిలిచారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే, దీని గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌తో యుద్ధం వద్దని, పాకిస్తాన్‌తో యుద్ధానికి తాను అనుకూలం కాదు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలనే పాకిస్తాన్ మీడియా సంస్థలు హైలెట్ చేస్తూ వార్తా కథనాలను నివేదించింది. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. ‘‘మనం యుద్ధానికి వెళ్లకూడదని ఎప్పుడు చెప్పలేదు’’ అని అన్నారు.
సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయనను ‘‘పాకిస్తాన్ రత్న’’ అంటూ పిలిచింది. సర్వత్రా విమర్శలు రావడంతో సీఎం ఈ రోజు మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌తో మనం ఎప్పుడూ యుద్ధం చేయకూడదని నేను ఎప్పుడూ చెప్పలేదు, యుద్ధం పరిష్కారం కాదని నేను చెప్పాను. పర్యాటకులకు రక్షణ ఇవ్వాలి. ఇది ఎవరి బాధ్యత? వైఫల్యం జరిగిందని నేను చెప్పాను ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. భారత ప్రభుత్వం తగినంత భద్రత కల్పించలేదు. యుద్ధం విషయానికొస్తే, అది అనివార్యమైతే, మనం యుద్ధానికి వెళ్లాలి’’ అని అన్నారు.
Read Alos: Pakistan: పాక్ పౌరులకు నేడే లాస్ట్ డే.. ఒక్క మహారాష్ట్రలోనే 5 వేల మంది పాకిస్థానీయులు..
అంతకుముందు, పాకిస్తాన్‌పై యుద్ధం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడంతో సిద్ధరామయ్య వివాదానికి తెరతీశారు. కఠినమైన భద్రతా చర్యలు ప్రారంభించాలని, యుద్ధం చేయడానికి మేము అనుకూలంగా కాదని, శాంతితో ఉండాలని, ప్రజలు సురక్షితంగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లను నిర్ధారించాలని అని ఆయన శనివారం అన్నారు.
ఈ వ్యా్ఖ్యలపై పాకిస్తాన్ ప్రముఖ వార్తా సంస్థ జియో న్యూస్ సహా పాకిస్తాన్ మీడియా కర్ణాటక సీఎం వ్యాఖ్యల్ని కవర్ చేసింది. ‘‘భారత దేశం నుంచి యుద్ధానికి వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నారు’’ అని పాక్ మీడియా అభివర్ణించింది. జియో న్యూస్ బులెటిన్ నుంచి ఓ క్లిప్‌ని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘‘సరిహద్దు అవతల నుంచి వజర్-ఎ-లా సిద్ధరామయ్యకు పెద్ద శుభాకాంక్షలు. పాకిస్తాన్ మీడియా సిద్ధరామయ్యని ప్రశంసిస్తోంది. పాకిస్తాన్ తో యుద్ధానికి వ్యతిరేకంగా చేసిన ఆయన వ్యాఖ్యల పట్ల బీజేపీ, ప్రజలు నిరాశ చెందారు’’ అని పోస్టులో పేర్కొన్నారు.
దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని ప్రస్తావిస్తూ విజయంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్న సింధు జల ఒప్పందంపై నెహ్రూ సంతకం చేసినందుకు పాకిస్తాన్ చాలా సంతోషంగా ఉంది కాబట్టి, నెహ్రూను రావల్పిండి వీధుల్లో ఓపెన్ జీపులో తీసుకెళ్లారు. పాకిస్తాన్‌లో ఓపెన్ జీపులో తీసుకెళ్లబడే భారతదేశం నుండి తదుపరి రాజకీయ నాయకుడు సిద్ధరామయ్య అవుతారా?’’ అని అడిగారు. కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక, సిద్ధరామయ్యను ‘‘పాకిస్తాన్ రత్న’’గా అభివర్ణించారు. మీ వ్యాఖ్యలతో మీరు రాత్రికి రాత్రే పాకిస్తాన్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందారని అన్నారు. అయితే, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సిద్ధరామయ్య వ్యా్ఖ్యలపై మాట్లాడేందుకు నిరాకరించారు.