CM Revanth Reddy’s Delhi Go to: Cupboard Enlargement on the Agenda

Written by RAJU

Published on:

  • కేబినెట్ విస్తరణపై అధిష్టానం కీలక నిర్ణయం?
  • ఢిల్లీలో సీఎం రేవంత్, ఏఐసీసీ నేతల మధ్య కీలక చర్చ
  • తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కొత్త సమీకరణాలు?
CM Revanth Reddy’s Delhi Go to: Cupboard Enlargement on the Agenda

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినకు బయలు దేరారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ప్రయాణంలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన వీరు, సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశం కానున్నారు.

ఈ హఠాత్‌ పర్యటన వెనుక ప్రధాన కారణం కేబినెట్ విస్తరణ కావొచ్చని అంచనా వేయబడుతోంది. గత కొన్ని రోజులుగా కేబినెట్‌ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం పలు దఫాలుగా చర్చలు జరిపింది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడం, ఏయే నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టాలి అనే అంశాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇదే నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.

CM Revanth Reddy : ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావొస్తున్నప్పటికీ, పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పడకపోవడం అధికార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు నేతలు మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పలు కీలక గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

రేవంత్ రెడ్డి అధిష్టానం ముందుకు రాష్ట్ర రాజకీయ పరిణామాలను, భవిష్యత్తు కార్యాచరణను వివరించనున్నారు. ఈ భేటీ అనంతరం, రేపట్లోనే మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

RRB ALP recruitment 2025: మళ్లీరాని ఛాన్స్.. రైల్వేలో 9,970 పోస్టులు.. ఇక వద్దన్నా జాబ్

Subscribe for notification