CM Revanth Reddy: రేవంత్‌తో మోహన్ బాబు భేటీ.. అసలు విషయమిదే

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 12 , 2025 | 01:41 PM

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని మంచు మోహన్‌బాబు, విష్ణు కలిశారు. జూబ్లీహిల్స్‌‌లోని సీఎం నివాసంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మోహన్‌బాబు, విష్ణు రేవంత్‌‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

CM Revanth Reddy: రేవంత్‌తో మోహన్ బాబు భేటీ.. అసలు విషయమిదే

CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని సినీ ప్రముఖులు కలిశారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు మర్యాద పూర్వకంగా కలిశారు. రేవంత్‌రెడ్డిని కలవడంపై సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంచు విష్ణు స్పందించారు. రేవంత్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రేవంత్ గురించి పలు విషయాలు తెలుసువడం, చర్చించడం చాలా అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రేవంత్ రెడ్డి అందిస్తున్న మద్దుతు, నిబద్ధతను అభినందిస్తున్నామని మంచు విష్ణు పేర్కొన్నారు.

MAHON-BABU.gif

మరోవైపు రేవంత్‌‌ను జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ ది‌ల్‌రాజ్ కలిశారు. గద్దర్ తెలంగాణ చలన చిత్ర పురస్కారాల విధి విధానాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమోదించిన నేపథ్యంలో దిల్‌రాజ్ కలిశారు. దిల్‌రాజ్ రేవంత్‌రెడ్డిని కలిసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వార్తలు కూడా చదవండి

Telangana Assembly budget session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ ప్రసంగం ఇదే

KCR arrives Telangana Assembly: అసెంబ్లీకి కేసీఆర్.. హాట్‌హాట్‌గా బడ్జెట్ సెషన్

TG News: అసెంబ్లీ పరిసరాల్లో గట్టి భద్రతా చర్యలు…

Read Latest Telangana News And Telugu News

Updated Date – Mar 12 , 2025 | 01:47 PM

Google News

Subscribe for notification