CM Revanth Reddy: భద్రాచలం ఆలయ అభివృద్ధిపై సీఎం నజర్‌

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 24 , 2025 | 04:09 AM

భద్రాచలం దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, నిధులకు సంబంధించి పూర్తి వివరాలను ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy: భద్రాచలం ఆలయ అభివృద్ధిపై సీఎం నజర్‌

  • భూసేకరణ, నిధుల వివరాలు సిద్ధం చేయాలంటూ అధికారులకు ఆదేశం

  • సీతారాముల కల్యాణానికి రావాలంటూ సీఎం రేవంత్‌కు మంత్రి సురేఖ ఆహ్వానం

హైదరాబాద్‌/భద్రాచలం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): భద్రాచలం దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, నిధులకు సంబంధించి పూర్తి వివరాలను ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. భద్రాచలం దేవస్థానంలో ఏప్రిల్‌ 6న నిర్వహించే శ్రీరామనవమి కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలంటూ ముఖ్యమంత్రిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలయ అర్చకులు, అధికారులు ఆహ్వానించారు. ఆదివారం హైదరాబాద్‌లో సీఎంను ఆయన నివాసంలో కలిసిన వారు.. ఆహ్వా న పత్రాన్ని అందించారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మలనూ ఆహ్వానించారు. అనంతరం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్‌ను సీఎం, మంత్రులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌.. భద్రాచలం ఆలయ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలను అందించాలని ఆదేశించారు. అనంతరం దేవస్థానం రామాయణ పారాయణదారుడు ఎస్టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు రచించిన తెలుగు కావ్య ప్రబంధ కథలు గ్రంథాన్ని సీఎం ఆవిష్కరించారు. తెలుగులో ఎంతో మంచి గ్రంథాన్ని రా శారని కృష్ణమాచార్యులును ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు నరేందర్‌ రెడ్డి, దేవాదా య శాఖ ముఖ్య కార్యదర్శి శైల జా రామయ్యర్‌, ఆ శాఖ కమిషనర్‌ శ్రీధర్‌, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

రహీం ఆగాఖాన్‌కు సీఎం అభినందనలు..

షియా ఇస్మాయిలీ ముస్లిం సమాజానికి 50వ వారసత్వ ఇమామ్‌గా, ఆగాఖాన్‌ డెవల్‌పమెంట్‌ నెట్‌వర్క్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రహీం ఆగాఖాన్‌కు సీఎం రేవంత్‌ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణ, విద్య, అభివృద్ధి కోసం ఆగాఖాన్‌ నెట్‌వర్క్‌ చేస్తున్న కృషి ఎంతో అమూల్యమైందని ఓ ప్రకటనలో కొనియాడారు. రహీం ఆగాఖాన్‌ నాయకత్వంలో రాష్ట్రానికి ఆగాఖాన్‌ నెట్‌వర్క్‌ సహకారం మరింత పెరగాలని సీఎం ఆకాంక్షించారు.

Updated Date – Mar 24 , 2025 | 04:09 AM

Google News

Subscribe for notification