- వందేళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి 500 కోట్ల నిధులు
- అంతర్జతీయ యూనివర్సిటీలతో మీరు పోటీ పడాలి
- రాజీవ్ గాంధీ కన్న కలలను నేరేవేరుద్దాం
- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో రూ.500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వందేళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి రూ. 500 కోట్ల నిధులు కేటాయించామన్నారు. అంతర్జతీయ యూనివర్సిటీలతో పోటీ పడాలని విద్యార్థులకు సూచించారు. రాజీవ్ గాంధీ కన్న కళలను నేరేవేరుద్దామన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం సోనియా గాంధీ కృషి చేశారని సీఎం తెలిపారు. రాజకీయాల్లో మహిళలు కూడా రావాలని చెప్పారు.
READ MORE: IND vs NZ Final: క్రిస్ గేల్ రికార్డ్ పై కోహ్లీ కన్ను.. మరో 46 పరుగులు చేస్తే ఛాంపియన్ ట్రోఫీలో నయా హిస్టరీ
మహిళలకు ఐఏఎస్ ఐనా.. మంత్రులు ఐనా అవకాశం వచ్చిన వాళ్ళు చిత్తశుద్ధి నిరూపించుకుని నిలబడుతున్నారన్నారు. మహిళలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఆడ బిడ్డలు అనాపైస లేకుండా గుడికి పోయినా ఖర్చు లేకుండా చేసినట్లు తెలిపారు. 200 యూనిట్ లకు ఉచిత విద్యుత్తు, మహిళలకు పాఠశాల నిర్వహణ బాధ్యత ఇచ్చామన్నారు. మహిళలకు 10 ఎలక్ట్రిక్ బస్సులు అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు వీటన్నింటితో పాటు చదువు చాలా ముఖ్యమని బాగా చదువుకొని యూనివర్సిటీకి పేరు తీసుకురావాలని కోరారు.
READ MORE: Women’s Commission : ట్రోల్ రాయుళ్ళకు మహిళా కమిషన్ సిరియస్ వార్నింగ్..