CM Chandrababu Naidu’s Kadapa Go to: Ontimitta Sitarama Kalyanam Highlights

Written by RAJU

Published on:

  • కడపలో చంద్రబాబు పర్యటన షెడ్యూల్
  • ఒంటిమిట్ట రామాలయానికి సీఎం సందర్శనం
  • సీతారామ కళ్యాణం‌లో సీఎం పాల్గొనబోతున్నారు
CM Chandrababu Naidu’s Kadapa Go to: Ontimitta Sitarama Kalyanam Highlights

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (ఏప్రిల్ 11) నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు మధ్యాహ్నం విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి సాయంత్రం 3:30 గంటలకు కడప ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుండి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్ హౌస్ కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు.

సాయంత్రం 5 గంటలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన సతీమణి నందమూరి భువనేశ్వరి, ఒంటిమిట్టలోని ప్రసిద్ధ శ్రీ కోదండ రామస్వామి దేవస్థానానికి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుంటారు. దర్శనం అనంతరం 6 గంటల నుండి 6:30 వరకు పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో పాల్గొంటారు.

అదే రోజు 6:45 గంటల నుండి 8:30 గంటల వరకు ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో సీఎం పాల్గొంటారు. అనంతరం 8:40కి తిరిగి టీటీడీ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేస్తారు. తర్వాతి రోజు అంటే ఏప్రిల్ 12 ఉదయం 9 గంటలకు, కడప ఎయిర్పోర్ట్ నుండి విజయవాడకు బయలుదేరతారు. అనంతరం ఉదయం 10:30కి విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

ఈ పర్యటనలో భాగంగా ఒంటిమిట్టలో జరిగే కళ్యాణోత్సవంలో ముఖ్యమంత్రి దంపతుల విచ్చేసే సందర్బంగా జిల్లా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. భద్రత, ట్రాఫిక్ మరియు ఇతర సౌకర్యాలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.

YS Jagan: కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తాం.. జగన్‌ 2.O మీరు కోరుకున్న విధంగా ఉంటుంది..!

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights