CM Chandrababu Naidu: జీవితాంతం సమాజం కోసమే!

Written by RAJU

Published on:

చివరి వరకు ప్రజల కోసమే పనిచేస్తా

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో కళ తప్పింది

ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు

అమరావతి/ విజయవాడ, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ‘నా జీవితాంతం సమాజం కోసం పనిచేయాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నా. చివరి వరకు ప్రజల కోసమే పనిచేస్తా’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనూ, కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆదివారం నిర్వహించిన ఉగాది సంబరాల్లోనూ ఆ యన మాట్లాడారు. ‘పండుగలు మన దేశ సంస్కృతిలో ఒక భాగం. అవి మన వారసత్వం. పండుగ అంటే స్వీట్లే కాకుండా.. అన్ని రకాల సమస్యలూ ఉం టాయి. వీటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను సమా జం, కుటుంబ వ్యవస్థలు మనకు ఇచ్చాయి. వికసిత్‌ భారత్‌ ద్వారా 2047 నాటికి ప్రపంచంలోకెల్లా నంబ ర్‌ 1, 2 స్థానాల్లో భారతదేశం ఉంటుంది. ఇప్పుడు నేను వేసే పునాది ప్రపంచంలోనే తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెడుతుంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…

ఉగాది మన సంప్రదాయం..

జనవరి 1 ఎంత ముఖ్యమో, ఉగాదికి అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాం. తెలుగు నూతన సంవత్సరం రోజున ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. కష్టా లు, సుఖాలు, అదృష్టం, దురదృష్టం గురించి ముం దుగానే తెలుసుకొని మానసికంగా సిద్ధపడుతున్నాం. పంచాగ శ్రవణం ద్వారా అన్నింటికీ తట్టుకుని నిలబడాలనే విషయాన్ని పెద్దలు వారసత్వ సంపదగా మనకు అందించారు. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఉత్సాహాన్ని, మంచి భవిష్యత్తును ఇవ్వాలి. సెల్‌ఫోన్‌ వ్యసనంగా మారితేనే సమస్య. దాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటే మీ జీవితాల్లో చాలామార్పు వస్తుంది. ఏ పని చేయాల న్నా అదుంటే చాలు. చివరికి ఆఫీస్‌ పని కూడా సెల్‌ఫోన్‌లో పూర్తి చేస్తున్నారు. అందుకే వాట్సాప్‌ గవర్నెన్స్‌ తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఎన్ని కష్టాలున్నా ఈ ఏడాది రూ.3.22లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టాం. అప్పుడు హైటెక్‌ సిటీ, ఐటీ టవర్స్‌ కట్టాను. ఇప్పుడు క్వాంటమ్‌ వ్యాలీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గురించి మాట్లాడుతున్నాను. 1996-97 మధ్యలో మలేసియా వెళ్లాను. 2 కోట్ల మంది జనాభా ఉన్న ఆ దేశంలో 8 లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు. మన దేశంలో అప్పటికే 110 కోట్ల జనాభా ఉన్నారు. ఒక్క రోడ్డు లేదు. అప్పుడు ప్రధాని వాజ్‌పేయికి చెబితే.. ఏం చేద్దామని అడిగారు. ఒక్క రోడ్డు వేసి చూపిస్తామని చెప్పి నెల్లూరు నుంచి చెన్నై వరకూ తొలిసారి ప్రయివేటు సెక్టార్‌లో రోడ్డు నిర్మాణం చేపట్టాం. అప్పటి నుంచి దేశం మొత్తం రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం.

గత ఐదేళ్లూ కళ తప్పింది

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో కళ తప్పింది. ఈ విధంగా కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలో అందరికీ అవమానాలే.. ఒకప్పుడు వాజపేయి, ఎన్టీఆర్‌, జ్యోతిబసు వంటి విలువలు కలిగిన వ్యక్తులతో పనిచేశా. ఇప్పుడు ఎవరితో పోటీ పడుతున్నానో ఒక్కసారి ఆలోచించుకుంటే అసంతృప్తి కలుగుతోంది. గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలు జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఒక్కొక్కటిగా వ్యవస్థల్ని గాడిన పెడుతున్నాం.

సమృద్ధిగా వర్షాలు: మాడుగుల

విశ్వవసు నామ సంవత్సరంలో రాష్ట్రంలో వర్షాలు బాగా పడతాయని, పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయని పంచాంగ శ్రవణంలో సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ తెలిపారు. గతంలో ఇరుకు దారులను మార్చి ఇంద్ర భవనాలు నిర్మించిన చంద్రబాబు మరో మహానగర నిర్మాణాన్ని పూర్తి చేస్తారని చెప్పారు.

స్వర్ణాంధ్రకు సహకరిద్దాం: గరికపాటి

సీఎం చంద్రబాబుపై సహస్రావధాని గరికపాటి ఒక పద్యం వినిపించారు. ‘రాష్ర్టాన్ని నడిపే వ్యక్తికి ఎన్ని సమస్యలు ఉంటాయో తెలియంది కాదు. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, పార్టీపరంగా ఇలా అనేక రకాల సవాళ్లను దాటుకొని ముందుకెళ్లాలి. అలాంటి ధైర్యం ప్రభుత్వాధినేతకు ఉంది. రాష్ర్టాన్ని స్వర్ణాంధ్ర చేయడానికి సహకరిద్దాం. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులన్నింటినీ కడదాం’ అన్నారు.

పురస్కారాల ప్రదానం

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది సంబారాల్లో భాగంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన 87 మందికి కళారత్న, 116 మందికి ఉగాది పురస్కారాలను సీఎం చంద్రబాబు అందించారు. దాదాపు గంటన్నర పాటు వేదికపై నిల్చుని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా పురస్కారాలు ప్రదానం చేశారు. ముందుగా 86 కళారత్న అవార్డులు ఇస్తున్నట్లు జీవో ద్వారా ప్రకటించారు. అయితే ఆదివారం ఉదయానికి ఆ సంఖ్య 87కి చేరింది. అలాగే తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరామ్‌కు కళారత్న అవార్డు ప్రకటించి, ఉగాది పురస్కారం అందించారు. కాగా, ఉగాది సంబరాల ఏర్పాట్లలోనూ, పురస్కార గ్రహీతలను సమన్వయం చేయడంలోనూ సాంస్కృతిక శాఖ పూర్తిగా విఫలమైంది. కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేశ్‌, కొలుసు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాలకు ఆస్తి స్వర్ణభారత్‌ ట్రస్ట్‌

‘స్వర్ణభారతి ట్రస్ట్‌ నేడు తెలుగు రాష్ర్టాలకు ఒక ఆస్తిగా తయారైంది. ఒక ట్రస్ట్‌ నడపడం అంత సులువు కాదు. అలాంటిది 24 ఏళ్లుగా స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ను నడుపుతున్న దీపా వెంకట్‌ను అభినందిస్తున్నా. ఈ ట్రస్ట్‌ ద్వారా గ్రామీణ ప్రజలకు విద్య, వైద్య సేవలు అందిస్తున్నారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కింద వేలాది మందికి శిక్షణ ఇస్తున్నారు. మా ట్రస్ట్‌కు ఈ పని చేసి పెట్టంటని వెంకయ్యనాయుడు ఎప్పుడూ అడగలేదు. నెల్లూరు, ఆత్కూరులో సొం తగా భూములు కొని ట్రస్ట్‌ను నడుపుతున్నారు. సంపద సృష్టి జరిగే క్రమంలో సమాజంలో విలువలు పతనమైతే దానికి సార్థకత ఉండదు’ అని సీఎం తెలిపారు. నేటితరం పిల్లల్లో సృజనాత్మకత లోపించిందని, గరికపాటి వంటివారు తమ ప్రవచనాల ద్వారా విలువల గురించి చెప్పాలని కోరారు.

అవాంఛనీయ ధోరణులు: వెంకయ్య

మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ అందిస్తున్న నైపుణ్య శిక్షణ దేశానికి అవసరమన్నారు. సమాజంలో ప్రబలుతున్న అవాంఛనీయ ధోరణులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువతలో వస్తున్న మార్పులు ఆందోళనకరంగా ఉన్నాయని, అత్యాచారాలు, పెళ్లి చేసుకుంటామని మోసాలు వంటివి ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సమాజాన్ని తీర్చిదిద్దాల న్న ఉద్దేశంతోనే కేంద్రం నూతన విద్యావిధానం తీసుకొచ్చిందని, దీనిపై విమర్శలు మానుకోవాలని అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి…

Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..

Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..

TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్‌

For More AP News and Telugu News

Updated Date – Mar 31 , 2025 | 03:35 AM

Subscribe for notification
Verified by MonsterInsights