తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 1995లో సీఎం మాదిరిగానే ఉంటా.. ఎవరైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాటతీస్తానంటూ హెచ్చరించారు. తప్పు చేసిన వాళ్లను శిక్షిస్తే ప్రజలు కూడా హర్షిస్తారన్నారు. కార్యకర్తలే పార్టీకి ముఖ్యమని.. కార్యకర్తలు హుషారుగా ఉంటే పార్టీకి ఓటమి ఉండదంటూ పేర్కొన్నారు. మిగిలిన పార్టీ జెండాలతో పోలిస్తే టీడీపీ జెండాకు ప్రత్యేక విశిష్టత ఉందంటూ సీఎం చంద్రబాబు తెలిపారు. అన్నదాతకు అండగా నాగలి. కార్మికులు, పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా చక్రం.. నిరుపేదలకు నీడ అందించే ఇల్లు టీడీపీ జెండాలో ఉన్నాయన్నారు. తమ నాయకుడి విజన్‌కి ఇదే నిదర్శనమంటూ సీఎం చంద్రబాబు చెప్పారు.
టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు తెలుగుదేశం జెండా ఆవిష్కరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి నారా లోకేష్, పలువురు నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
వీడియో చూడండి..
అర్థమైందా రాజా.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు..
టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెడ్‌బుక్‌పై మంత్రి లోకేష్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్‌బుక్ పేరు వింటే కొంతమందికి గుండెపోటు వస్తోందన్నారు. మరికొంత మంది బాత్రూమ్‌లో పడి చెయ్యి ఇరగ్గొట్టుకుంటున్నారంటూ పేర్కొన్నారు. అర్థమైందా రాజా.. అధికారాన్ని చూసి గర్వపడొద్దంటూ మంత్రి లోకేష్ కామెంట్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..