అమరావతి: సింహాచలం ఘటన (Simhachalam tragedy)లో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం (AP Government) ఎక్స్‌గ్రేషియా (ex-gratia) ప్రకటించింది. మృతుల (Victims) కుటుంబాలకు (Families) రూ.25 లక్షల (Rs. 25 lakhs)చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే క్షతగాత్రులకు రూ.3 లక్షల (Rs. 3 lakhs) చొప్పన పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం (outsourcing job offer) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించింది.
Also Read: Minister Anam: మృతులకు నా ప్రగాఢ సానుభూతి..
కాగా సింహాచలం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు తదితరులు పాల్గొన్నారు. సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.. మంత్రి నిమ్మల
సింహాచలం ప్రమాద ఘటనపై మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి భక్తులు మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. భాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందిన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందుతుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు మంత్రి నిమ్మల తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కాగా సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. రూ. 300 టికెట్ కౌంటర్ దగ్గర గాలి, వానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న రిస్క్యూ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, మృతదేహాలను కేజీహెచ్ ఆస్పత్రికి తరలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింహాచలం ఘటన నన్ను కలచివేసింది..
సింహాచలంలో ఘోర ప్రమాదం..7 గురు మృతి
1300 కోట్లతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి: సంధ్యారాణి
For More AP News and Telugu News
Updated Date – Apr 30 , 2025 | 09:16 AM