CM Chandrababu: ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం

Written by RAJU

Published on:

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా రాజధాని అమరావతి పనులు పున: ప్రారంభమయ్యాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియా, సోషల్ మీడియా వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

ప్రజల సహకారంతో, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో, పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి తమకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరుపేరునా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

కాగా.. అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న(శుక్రవారం) పర్యటించారు. ప్రధానిమోదీ పర్యాటన ఆసక్తికరంగా సాగింది. అమరావతి సభ వేదిక నుంచి ఏపీలో రూ. 58 వేల కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుట్టారు. ఏపీలో పలు ప్రాజెక్ట్‌లకు శకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అమరావతి సభకు ఏపీలోని వివిధ జిల్లాల నుంచి రైతులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. అమరావతి సభ కోసం ఏపీ ప్రభుత్వం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లాల నుంచి ప్రజలను తీసుకురావడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ వార్తలు కూాడా చదవండి

AP NEWS: సీరియల్ కిల్లర్‌‌ను చూసి వణికిపోయిన ప్రజలు

Vijayawada: అంతా పీఎస్సార్‌ కనుసన్నల్లోనే

Simhachalam: నోటి మాటతో గోడ కట్టేశారు

Simhachalam tragedy: గత ఐదేళ్లలో ఎన్నో ప్రమాదాలు.. అవన్నీ వైసీపీ ప్రభుత్వ హత్యలేనా

Andhra Pradesh weather: నేడు అక్కడక్కడా వర్షాలు ఎండలు

For More AP News and Telugu News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights