అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్‌ల సమావేశం ఇవాళ(మంగళవారం) రాష్ట్ర సచివాలయంలో జరిగింది. వేసవి నీటి ఎద్దడిపై సీఎం చంద్రబాబు ఆయా జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వేసవి పూర్తయ్యే వరకు జిల్లాల్లో కాల్‌సెంటర్లు పెట్టుకోవాలని.. తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నీళ్ల సమస్యలపై జీపీఎస్ – రియల్ టైమ్ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వేసవిలో ఎక్కడా కూడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు ఎక్కడైనా సరే తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికోసం వేసవి కాలం పూర్తయ్యేవరకు జిల్లాలో తాత్కాలిక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మంచినీళ్ల సమస్య ఎక్కడైనా తలెత్తినా దాన్ని రియల్ టైమ్‌లో పర్యవేక్షించి పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అన్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను అన్నింటిని నీటితో నింపాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ప్రజలకు తాగునీరు అందించే ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడా కూడా నిధులకు కొరత లేదని, జిల్లా కలెక్టర్లు దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వేసవి నీటి ఎద్దడి ఎదుర్కోవడంలో హేతుబద్దంగా పనిచేయాలని, అప్పుడే ప్రజలు మన పనులను హర్షిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
పీఎం సూర్యఘర్ పథకంపై సమీక్ష
కలెక్టర్ల సమావేశంలో పీఎం సూర్య ఘర్ పథకంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల రూఫ్ టాప్ యూనిట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆ ప్రకారం ఈ ఏడాది ఏపీలో 20 లక్షల రూఫ్ టాఫ్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
2 కిలోవాట్ రూఫ్ టాప్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం రూ.60వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.55 వేలను సబ్సిడీగా అందిస్తోందని తెలిపారు. అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తే యూనిట్‌కు రూ. 2ల 90 పైసల వంతున చెల్లిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎస్టీ, ఎస్సీలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ
Read Latest AP News And Telugu News
Updated Date – Mar 25 , 2025 | 07:19 PM