ABN
, Publish Date – Apr 03 , 2025 | 03:23 PM
Weather Updates: హైదరాబాద్‌లో భారీగా వర్షం కురుస్తోంది. వర్షం రాకతో భాగ్యనగరంలో
ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

Weather Updates
హైదరాబాద్, ఏప్రిల్ 3: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిరోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడిపోయిన నగర వాసులకు (Hyderabad) వర్షం రాకతో కొంత ఉపశమనం లభించింది. మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోత ఇబ్బందులు పడగా.. ఆ తరువాత భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడిపోయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. నగరంలోని బషీర్ బాగ్, సైఫాబాద్, అబిడ్స్, కోఠి పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో ఉదయం నుంచి ఎండతో ఉక్కిరిబిక్కిర అయిన హైదరాబాదీలు ఒక్కసారిగా వర్షం పడటంతో ఎంజాయ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Amaravati Capital Construction: అమరావతికి నిధులొచ్చాయ్
NTPC Fined: పెద్దపల్లిలో ఎన్టీపీసీకి బిగ్ షాకిచ్చిన మున్సిపల్ శాఖ
Read Latest Telangana News And Telugu News
Updated Date – Apr 03 , 2025 | 03:25 PM