ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు, ఏప్రిల్ 07, 2025న 08:30 గంటలకు దక్షిణ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది.. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం ఏప్రిల్ 08 తేదీ వరకు వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతంవైపు కదిలే అవకాశం ఉంది.. ఆ తరువాత 48 గంటల్లో దాదాపు ఉత్తరం వైపు ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతములో విస్తరించే అవకాశం ఉంది.
ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. మరాఠ్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అంతర్భాముగా ఉత్తర-దక్షిణ ద్రోణి ఈరోజు తక్కువగా గుర్తించబడింది. దక్షిణ అంతర్గత కర్ణాటక, పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఈరోజు తక్కువగా గుర్తించబడినది.. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణం ఎలా ఉంటుంది. అధికారుల సూచనలు ఏంటి అనేది చూడండి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం :-
సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:-
సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
గమనిక :- ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్-యానాంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.. రాగాల నాలుగు రోజుల్లో క్రమంగా 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశముంది. తరువాత స్వల్పంగా తగ్గే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు దక్షిణ ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలో రాగల నాలుగు రోజుల్లో క్రమంగా 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశముంది.. తరువాత స్వల్పంగా తగ్గే అవకాశముంది.. అని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..