ABN
, Publish Date – Apr 02 , 2025 | 12:09 AM
మున్సిపల్ కార్యాలయంలోని కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు.

నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న సీఐటీయూ నాయకులు
ధర్మవరం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ కార్యాలయంలోని కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ మండల కన్వీనర్ జేవీ రమణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ విదానాన్ని రద్దు చేయాలని ఆలోచిస్తోందని, ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలను వెంటనే విరమించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎల్ ఆదినారాయణ, అయూబ్‌ఖాన, హైదర్‌వలీ, పారిశుద్యకార్మికసంఘం నాయకులు బాబు, ముకుంద లక్ష్మీఓబుళేశు, ఇంజనీరింగ్ కార్మికసంఘం నాయకులు బొగ్గునాగరాజు, అనిల్, దస్తగిరి పాల్గొన్నారు.
Updated Date – Apr 02 , 2025 | 12:09 AM