- HCU విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించండి
- పోలీసు అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో Hcu టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ తో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి చర్చల తదుపరి డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు.
Also Read:Aqua: ట్రంప్ నిర్ణయంతో ఆక్వా రంగం కుదేలు.. కేంద్రానికి చంద్రబాబు లేఖ..
ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సూప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. Hcu, కంచె గచ్చిబౌలి స్థలాల్లో ఎలాంటి పనులు చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. HCU కంచె గచ్చిబౌలి సమస్యపై తెలంగాణ ప్రభుత్వం.. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు మంత్రులతో కమిటీ వేసింది.