- అన్యాయమైన వాణిజ్య పద్ధతులే చైనా వృద్ధికి ఆజ్యం పోశాయి..
- ప్రపంచ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించే కార్మిక పద్దతులను పాటిస్తుంది..
- చైనా ఆధిపత్యంతో ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు: పీయూష్ గోయల్

Piyush Goyal: చైనాపై మరోసారి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు గుప్పించారు. అన్యాయమైన వాణిజ్య పద్ధతులను ఉపయోగించి చైనా ఆర్థిక వృద్ధిని సాధిస్తోందని ఆరోపించారు. ధరల వక్రీకరణ, అస్పష్టతమైన సబ్సిడీలు, ప్రపంచ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించే కార్మిక రూల్స్ బీజింగ్ వృద్ధికి కారణమని పేర్కొన్నారు.
Read Also: Pawan Kalyan Son Mark Shankar: పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు..
అయితే, ప్రపంచ వాణిజ్యంలో డ్రాగన్ కంట్రీ చైనా ఆధిపత్యం పెరగడంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. వీటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోకపోతే.. ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదన్నారు. అలాగే, ప్రపంచ వాణిజ్య నిబంధనల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇక, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ కాలంలో భారత్- చైనాల మధ్య వాణిజ్య లోటు సాధారణంగా ఉంది.. కానీ, గత యూపీఏ ప్రభుత్వ హయాంలో అది 25 రెట్లకు పెరిగిపోయిందని పీయూష్ గోయల్ ఆరోపించారు.
Read Also: US-China Trade War: నువ్వు భయపెడితే భయపడం.. అమెరికాకు చైనా వార్నింగ్
ఇక, బీజింగ్ లోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాతో రాహుల్ గాంధీకి ఒప్పందం ఉందనే విషయం మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని కేంద్ర మంత్రి గోయల్ పేర్కొన్నారు. ఆ ఒప్పందం తర్వాత భారత్‌లోకి వచ్చిన అనేక చైనా ఉత్పత్తులపై సుంకాలు భారీగా తగ్గిపోయాయి.. ఇది మన స్థానిక ఉత్పాదక రంగాలపై తీవ్ర ప్రభావం చూపించిందని ఆయన తెలిపారు. మనం పూర్తిగా చైనాపై ఆధారపడేలా చేసింది అన్నారు. మరోవైపు, ప్రధాని మోడీ- డొనాల్డ్ ట్రంప్ “చాలా మంచి స్నేహితులు”.. దీని వల్ల అమెరికా- భారతదేశం మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మరింత బలంగా మారుతుందని పీయూష్ గోయల్ అన్నారు.