Chilled Water : వేసవిలో ఫ్రిజ్‌లోని చల్లని నీళ్లు తాగుతున్నారా.. జాగ్రత్త..

Written by RAJU

Published on:

సమ్మర్ సీజన్‌లో నీరు ఎక్కువగా తీసుకోని, హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో చాలా మందికి చల్లని పానీయాలు తీసుకోవాలని అనిపిస్తుంటుంది. లస్సీ, మజ్జిగ, కొబ్బరి నీళ్లను ఎక్కువగా తీసుకుంటారు. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి నాలుగు నుండి ఐదు లీటర్ల నీరు తాగాలని నిపుణులు సిఫార్సు చేస్తారు. వేసవి కావడంతో చాలా మంది ఎక్కువగా రిఫ్రిజిరేటర్ లోని చల్లని నీరు తాగడానికి ఇష్టపడతారు. అయితే, ఫ్రిజ్‌లోని చల్లని నీళ్లు తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయుర్వేదం కూడా చల్లటి నీరు ఆరోగ్యానికి హానికరమని చెబుతుంది. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ నుండి చల్లటి నీరు తాగకూడదని సలహా ఇస్తుంది. ఈ రోజు మనం రిఫ్రిజిరేటెర్ నీరు తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హృదయ స్పందన రేటు నెమ్మదిస్తుంది

వేసవిలో రిఫ్రిజిరేటర్ నీటిని ఎక్కువగా తాగితే, అది మీ హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. హృదయ స్పందన రేటు మందగించినప్పుడు, రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది తలతిరగడం, అలసట, బలహీనత వంటి సమస్యలకు దారితీస్తుంది.

మలబద్ధకం సమస్య

మీరు రిఫ్రిజిరేటర్ నుండి చల్లని నీరు తాగితే మీకు మలబద్ధకం సమస్య రావొచ్చు. చల్లటి నీరు పేగు పనితీరును ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియ, విసర్జన ప్రక్రియలను అడ్డుకుంటుంది. దీని కారణంగా శరీరం నుండి విషాన్ని తొలగించడం కష్టం అవుతుంది.

గొంతు నొప్పి వచ్చే అవకాశం

మీరు క్రమం తప్పకుండా చల్లని నీరు తాగితే అది గొంతు నొప్పికి కారణమవుతుంది. గొంతులో వాపు, చికాకు కలుగుతుంది. దీనివల్ల గొంతులో శ్లేష్మం పేరుకుపోతుంది. మీకు గొంతు నొప్పి రావడమే కాకుండా జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా వస్తుంది.

తలనొప్పి

మీరు ఎండలో బయట తిరిగిన తర్వాత ఇంటికి రాగానే చల్లని నీరు తాగితే మీకు తలనొప్పి రావచ్చు. చల్లటి నీరు తాగడం వల్ల శరీరం త్వరగా చల్లబడుతుంది. ఇది శరీరంలోని నరాలను, ముఖ్యంగా వెన్నెముక నరాలను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా, ఇది మెదడును కూడా ప్రభావితం చేస్తుంది.

బరువు పెరగవచ్చు

మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే రిఫ్రిజిరేటెడ్ నీరు తాగడం మానేయండి. రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన నీరు తాగడం వల్ల శరీరంలోని కొవ్వు గట్టిపడుతుంది. ఇది బరువు తగ్గించే ప్రక్రియను నెమ్మదిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights