
ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన సమయం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాటిని రోజువారీ జీవితంలో ఉపయోగించడానికి సృజనాత్మకమైన, ఆశ్చర్యకరమైన మార్గాలను కనుగొంటున్నారు. ఈ-మెయిల్‌లు రాయడానికి, గణిత సమస్యలను పరిష్కరించడానికి ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగించడం విద్యార్థులకు రోజువారీ పనిగా మారింది. భారతదేశంలో ప్రాంతానికి అనుగుణంగా ప్రాంతీయ భాషలు ఉంటాయి. అయితే చదువుకున్న వారు ఇంగ్లిష్‌తో కమ్యూనికేట్ చేసుకున్నా డ్రైవర్లు వంటి వారికి మనం ఏం చెబతున్నామో? అర్థం కాదు. ఈ నేపత్యంలో ఓ ఔత్సాహికుడు ఆటో డ్రైవర్‌తో ఏఐ సాయంతో సంభాషణ స్టార్ట్ చేశాడు.
కర్ణాటకలో ఒక కంటెంట్ సృష్టికర్త కన్నడ భాషలో ఆటో ఛార్జీలను బేరసారాలు చేయడానికి ఏఐను ఉపయోగించాడు. ఈ వీడియోను బెంగళూరులో చిత్రీకరించారు. ముఖ్యంగా ఏఐ వాయిస్ ఫీచర్ సాయంతో ఆటో డ్రైవర్ కిరాయి రూ.200 చెబితే దాన్ని రూ.100 తగ్గించాలని కోరాడు. తాను విద్యార్థినని, తరచూ ఇదే దారిలో వెళ్తాను అని కన్నడలో ఏఐ వాయిస్ ఫీచర్ సాయంతో అనువదించాడు. ఇలా క్రమేపి ఆటో డ్రైవర్ కిరాయిను రూ.120కు ఫైన్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లను మిశ్రమంగా స్పందిస్తున్నారు. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది.
View this post on Instagram
అయితే ఈ వీడియో స్క్రిప్టెడ్ వీడియో అని చాలా మంది నెటిజన్లు పేర్కొంటున్నారు. చాలా మంది ఊహించినట్లుగా ఇది స్క్రిప్టెడ్ వీడియో అని అతను నిజమైన ఆటో డ్రైవర్ కాదని వీడియోలో చెప్పారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ భాషా అంతరాలను ఎలా తగ్గిస్తుందో? చూపించాలనే తలంపుతో వీడియో చేశామని అతను పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి