- ఈ రోజు పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బిల్లు..
- పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

Waqf amendment bill: ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’కు మిత్ర పక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే, టీడీపీ, జనసేన పార్టీలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. లోక్‌సభలో ప్రవేశపెట్టే వక్ఫ్ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ అధికార ప్రతినిధి ప్రేమ్ కుమార్ జైన్ ప్రకటించారు. తాము జేపీసీకి ప్రతిపాదించిన మూడు సవరణలు డ్రాఫ్ట్ బిల్లులో పెట్టినట్లు ఆయన చెప్పారు. మరోవైపు, ఎన్డీయే కీలక భాగస్వామి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు జనసేన ట్వీట్ చేసింది.
Read Also: Ratan Tata: ఔదార్యంలో రతన్ టాటాకు సాటి లేరు.. చివరకు వంటవాడికి కూడా రూ. 1 కోటి..
ఇదిలా ఉంటే, తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు వక్ఫ్ బిల్లుపై తన పార్టీ ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముసాయిదా బిల్లులోని వివరాలను సమీక్షించిన తర్వాత, తన ఎంపీ మద్దతుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభలో బిల్లుకు మద్దతు ఇవ్వాలని, వక్ఫ్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. వక్ఫ్ బిల్లుకు చేసిన సవరణలను కూడా ఆయన ఆమోదించారు. టీడీపీ ఎంపీలంతా బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని విప్ జారీ చేశారు. టీడీపీ ఎంపీలు బిల్లుకు మద్దతు ఇస్తారు, కానీ ముస్లింయేతరుల ప్రాతినిధ్యంపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డులో ముస్లింయేతర ప్రాతినిధ్యంపై కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయం వదిలేయాలని టీడీపీ కోరుతున్నట్లు సమాచారం.