Chandrababu: మేం ప్రాజెక్టులు నిర్మిస్తుంటే.. వైసీపీ పాడు చేస్తోంది: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

Written by RAJU

Published on:

Chandrababu: మేం ప్రాజెక్టులు నిర్మిస్తుంటే.. వైసీపీ పాడు చేస్తోంది: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

తాను లిఫ్ట్‌ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే.. వైసీపీ దాన్ని పాడు చేస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. మళ్లీ తాను అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని బాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా ముప్పాళ్లలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.. 2004, 2019లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి మరో స్థాయిలో ఉండేదని పేర్కొన్నారు. 9 నెలల్లోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిపాలనను గాడిలో పెట్టామన్నారు.

సామాజిక న్యాయం గురించి అందరికంటే ముందు తానే ఆలోచించానన్నారు చంద్రబాబు. 30 ఏళ్ల క్రితమే తాను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇదే సరైన నిర్ణయమే అని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు. మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమం ఓ చరిత్ర అన్నారు సీఎం చంద్రబాబు. దీని వల్ల సమాజంలోని అసమానతలు తొలగించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు.. వైసీపీ నేత చెల్లుబోయిన..

చంద్రబాబు వ్యాఖ్యలపై.. వైసీపీ నేత మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు స్పందించారు. చంద్రబాబు రాజీ రాజకీయాల వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారంటూ విమర్శించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. కేంద్రం చేపట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతల కోసం స్పెషల్ కేటగిరి స్టేటస్‌ను కూడా చంద్రబాబు వదిలేసారని ఆరోపించారు. ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆరోపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights