Champions Trophy: ఒకప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ హీరో.. కట్ చేస్తే.. జీవనోపాధి కోసం క్లీనర్‌గా మారిన స్టార్ ఆల్‌రౌండర్‌!

Written by RAJU

Published on:


2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత జట్టుపై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన క్రిస్ కెయిన్స్.. ఒకప్పుడు న్యూజిలాండ్ క్రికెట్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన అద్భుత ఆటగాడు. కానీ గడిచిన 25 ఏళ్లలో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఓ సమయంలో అభిమానులను మెస్మరైజ్ చేసిన ఈ ఆల్‌రౌండర్‌.. ఇప్పుడు కూలీగా, క్లీనర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. హాలీవుడ్ హీరో లాంటి స్టైల్, రింగుల జుత్తు, ఆటలో తనదైన ప్రతిభ.. క్రిస్ కెయిన్స్‌ను న్యూజిలాండ్ క్రికెట్‌లో ఒక ప్రత్యేకమైన ఆటగాడిగా నిలబెట్టాయి. ఆల్‌రౌండర్‌ ఇయాన్ బోథమ్‌ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన క్రికెటర్‌గా క్రిస్ కెయిన్స్ ఎదిగాడు. కానీ, జీవితంలో మార్పులు ఎప్పుడూ ఊహించని విధంగా చోటు చేసుకుంటాయి. ఎప్పుడో క్రికెట్ ప్రపంచాన్ని తన ఆటతో అలరించిన కెయిన్స్.. ఇప్పుడు పూర్తిగా మారిపోయి, అనుకోని పరిస్థితులలో పడిపోయాడు.

క్రిస్ కెయిన్స్ కెరీర్‌కు ఉన్నత స్థాయిలోనే ముగింపు వచ్చింది. ఆటతో సంపాదించిన డబ్బుతో వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. కానీ, విలాసాలకు అలవాటు పడిన అతడు డబ్బును పొదుపు చేయకుండా ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలంలోనే అతను అప్పుల పాలయ్యాడు. ఆర్థికంగా పూర్తిగా దిగజారిపోయాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లాడు.

ఆర్థికంగా కుదేలైన కెయిన్స్, ఆరోగ్యపరంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఓ దశలో గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స కోసం డబ్బులు లేక కష్టాలు ఎదుర్కొన్నాడు. చివరకు, బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అతని ఆరోగ్యం మరింత దిగజారిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, అతడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి చిన్నచిన్న పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒకప్పుడు మ్యాచ్‌లు గెలిపించిన క్రికెట్ లెజెండ్.. ఇప్పుడు తన జీవితాన్ని కొనసాగించడానికి ట్రక్ డ్రైవర్‌గా, బస్సులను శుభ్రం చేసే పనులు చేసుకుంటున్నాడు. ఇంతవరకు తాను ఎదుర్కొన్న కష్టాలను, మానసిక ఒత్తిడిని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “జీవితం ఎప్పుడూ ఊహించినట్టు ఉండదు. నేను తప్పులు చేశాను. కానీ, ఇప్పుడు నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

క్రిస్ కెయిన్స్ తన క్రికెట్ కెరీర్‌లో అద్భుత ప్రదర్శనలు కనబరిచాడు. 62 టెస్టులు, 215 వన్డేలు, 2 టీ20ల్లో, 8273 అంతర్జాతీయ పరుగులుచేసాడు. 420 అంతర్జాతీయ వికెట్లు, 81 క్యాచులు పట్టాడు. క్రిస్ కెయిన్స్ ఒకప్పుడు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న అద్భుత ఆటగాడు. కానీ, ఆటను వీడిన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఇది క్రికెట్ ప్రపంచంలోనే జీవితంలోనూ గొప్ప బుద్ధి కలిగించే కథ. అద్భుతమైన కెరీర్‌ ఉన్నప్పటికీ, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎదురైన సమస్యలు అతనిని పూర్తిగా దిగజార్చేశాయి. ఇప్పుడు అతను సాధారణ జీవితం గడపాల్సిన పరిస్థితిలో ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification