Certificates Course: ఎన్‌సీటీడీసీలో కాయర్‌ కోర్సులు

Written by RAJU

Published on:

కేరళ, అలప్పుజలోని నేషనల్‌ కాయర్‌ ట్రెయినింగ్‌ అండ్‌ డిజైన్‌ సెంటర్‌(National Choir Training and Design Centre) (ఎన్‌సీటీడీసీ) – డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కాయర్‌ టెక్నాలజీ కోర్సు, సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ కాయర్‌ ఆర్టిసన్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 20 శాతం సీట్లు ప్రత్యేకించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.3,000ల స్టయిపెండ్‌ ఇస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజమండ్రిలో ప్రాంతీయ కార్యాలయం ఉంది. కాయర్‌ పరిశ్రమలు, కాయర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలు స్పాన్సర్‌ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. మహిళలకు హాస్టల్‌ సౌకర్యం కల్పిస్తారు. పురుషులకు రూ.500ల రీయింబర్స్‌మెంట్‌ ఇస్తారు.

డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కాయర్‌ టెక్నాలజీ: ఇది ఏడాది వ్యవధిగల అడ్వాన్స్‌డ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌. తరవాత మూడు నెలల ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటర్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌ 2023 ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమౌతుంది.

సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ కాయర్‌ ఆర్టిసన్‌: దీని వ్యవధి ఆర్నెల్లు. తరవాత ఒక నెల ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. చదవడం, రాయడం తెలిసినవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ట్రెయినింగ్‌ కోర్సు 2023 జనవరి 2 నుంచి ప్రారంభమౌతుంది.

ముఖ్య సమాచారం

అభ్యర్థుల వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: నవంబరు 30

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: అసిస్టెంట్‌ డైరెక్టర్‌, నేషనల్‌ కాయర్‌ ట్రెయినింగ్‌ అండ్‌ డిజైన్‌ సెంటర్‌, కాయిర్‌ బోర్డ్‌, కలవూర్‌.పి.అలప్పుజ, కేరళ – 688522

ఈమెయిల్‌: adnctdc@gmail.com

వెబ్‌సైట్‌: www.coirboard.gov.in

Subscribe for notification
Verified by MonsterInsights