Central Bank Credit Officer Recruitment 2025 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వివరాల్లోకెళ్తే..
హైలైట్:
- సీబీఐ క్రెడిట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025
- 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన
- ఫిబ్రవరి 20 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది

ఇతర ముఖ్యమైన సమాచారం :
- క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు : 1000
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ 55 శాతం) ఉండాలి.
- వయోపరిమితి: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ ఎస్టీ వారికి ఐదేళ్లు, ఓబీసీకి మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది).
- పే స్కేల్: నెలకు రూ.48,480 – రూ.85,920 వరకు వేతనం ఉంటుంది.
- ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు ఫీజు: రూ.750, జీఎస్‌టీ (ఎస్సీ, ఎస్టీ, మహిళలకు, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175, జీఎస్‌టీ).
- దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: జనవరి 30, 2025
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2025
CBI Credit Officer పరీక్ష విధానం: ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ (రిలేటెడ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ) సబ్జెక్టుల నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కుల చొప్పున ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎస్‌ఏ పరీక్ష రెండు ప్రశ్నలకు 30 మార్కులకు ఉంటుంది. పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 266 ఉద్యోగాలు.. రూ.85,920 వరకు జీతం
CBI ZBO Recruitment 2025 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India).. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్ భారీ జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాలకు డైరెక్ట్ లింక్ ఇదే. అలాగే.. ఇతర బ్యాంక్ ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకోవడానికి క్లిక్ చేయండి.