Central Authorities Launches New Aadhaar App with QR Code and Face Recognition for Trouble-Free Verification

Written by RAJU

Published on:

  • ఆధార్ కార్డ్ కష్టాలకు ఇకపై చెక్.
  • కొత్త ఆధార్ యాప్ లాంచ్ చేసిన కేంద్రం
  • రియల్ టైం ఫేస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లను అందుబాటులోకి.
  • కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కొత్త యాప్ ను విడుదల.
Central Authorities Launches New Aadhaar App with QR Code and Face Recognition for Trouble-Free Verification

Aadhaar App: భారతీయులకు శుభవార్త.. ఆధార్ కార్డ్ వినియోగించే సమయంలో పడే కష్టాలకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన కొత్త ఆధార్ యాప్ ద్వారా చెక్ పడనుంది. భారతదేశంలో నివసించే ఏ వ్యక్తికైనా సరే.. తన నిర్ధారణ కోసం కచ్చితంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. మొబైల్ లోకి సిమ్ కార్డు కొనే దగ్గర నుంచి రేషన్ షాప్ లో సరుకులు తీసుకొనేంతవరకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇప్పటివరకు మనం ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకువెళ్లకపోయినా.. దాని డూప్లికేట్ ను తయారు చేయించి మనతోపాటు తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. నిజానికి ఎప్పుడు ఏ సమయంలో ఆధార్ కార్డు అవసరం పడుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ప్రతిసారి ఆధార్ కార్డు మన చేతిలో లేకపోవడంతో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే, ఇకపై ప్రజలకు ఇబ్బందులు తప్పబోతున్నాయి.

Read Also: Moto G Stylus 5G: మోటరోలా నుంచి కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్ అధికారికంగా లాంచ్.. ఫీచర్లు ఇవే!

ఇకపై ప్రతిసారి మనతోపాటు మన ఆధార్ కార్డు తీసుకువెళ్లాల్సిన పనిలేదు. దీనికోసం కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కొత్త యాప్ ను ఆవిష్కరించారు. దీని ద్వారా క్యూఆర్ కోడ్ సహాయంతో తక్షణం వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. అంతేకాదు, ఈ యాప్ లో రియల్ టైం ఫేస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇకపోతే, ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే.. వ్యక్తిగత ధ్రువీకరణ పరిశీలించే చోట ఆధార్ కార్డు వద్ద ఓ క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఆ సమయంలో మన ఆధార్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసినట్లయితే మీ ధ్రువీకరణ చాలా సులువుగా అయిపోతుంది. ఈ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తిగా చాలా సులువుగా, సురక్షితంగా ఉంటుంది. ఈ యాప్ సంబంధించి బీటా పరీక్షలు ఒక్కసారి పూర్తయితే, దేశవ్యాప్తంగా ఈ ఫుల్ వర్షన్ అమలులోకి వస్తుందని మంత్రి తెలిపారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights