– మహిళా ప్రయాణికుల బోగీలో ప్రత్యేక పానిక్ బటన్
– అధికారులకు ఎస్‌సీఆర్ జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆదేశం
హైదరాబాద్ సిటీ: ప్రయాణికుల భద్రత కోసం మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) బోగీల్లో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) నిర్ణయించింది. వాటి సాయంతో రియల్‌టైంలో ఎంఎంటీఎస్ రైళ్లలో శాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వ రైల్వే పోలీసుల (జీఆర్‌పీ)కు, రైల్వే రక్షణ దళాని (ఆర్‌పీఎఫ్)కి అప్పగించింది.
ఈ వార్దను కూడా చదవండి: 30న హుజూర్‌నగర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడి యత్నం ఘటన నేపథ్యంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎస్‌సీఆర్ జీఎం అరుణ్‌కుమార్ జైన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లలో ప్రయాణికులకు భద్రతపై రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. మహిళలపై నేరాల దర్యాప్తు కోసం స్థానిక పోలీసులు, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ(Police, RPF, GRP) జవాన్లతో ఉమ్మడి టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
ముఖ్యంగా మహిళల బోగీల్లోకి ఆకతాయిలు ప్రవేశిస్తే బాధితులకు సులభంగా యాక్సెస్ అయ్యేలా పానిక్ బటన్ అమర్చడంతోపాటు దాన్ని కంట్రోల్ రూమ్‌కూ రైలు గార్డుకూ అనుసంధానించేలా ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భద్రతా హెల్ప్‌లైన్ 139 నంబర్‌కు వెంటనే డయల్ చేయగలిగేలా ఎస్‌ఓఎస్ మొబైల్ యాప్ తేవాలని రైల్వే ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మీ మనసు బాధపడితే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటా..
మిస్ వరల్డ్ పోటీలకు 54 కోట్ల ఖర్చు తప్పుకానప్పుడు ఫార్ములా-ఈ తప్పుకాదు
త్వరలో ఎకో టూరిజం పాలసీ
డ్రగ్స్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
Read Latest Telangana News and National News
Updated Date – Mar 26 , 2025 | 07:15 AM