సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి విద్యార్థుల పరీక్షా విధానంలో కీలక సంస్కరణ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది 2026 నుంచి టెన్త్ బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ముసాయిదాను CBSE ఆమోదించింది. ఈ క్రమంలో CBSE 10వ తరగతి బోర్డు పరీక్ష మొదటి దశ ఫిబ్రవరి-మార్చిలో జరగనుండగా, రెండో దశ మే 2026లో జరుగుతుంది.
కొత్తగా ఆమోదించబడిన మార్గదర్శకాల ప్రకారం 10వ తరగతి బోర్డు పరీక్షలు రెండు దశల్లో నిర్వహించబడతాయి. రెండు విడతల్లో పరీక్షలు మొత్తం సిలబస్‌ను కవర్ చేస్తాయి. ఆ క్రమంలో విద్యార్థుల జ్ఞానం, నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేస్తారు. దీనివల్ల విద్యార్థులు తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి అవకాశం లభిస్తుంది. దీని ద్వారా విద్యార్థులకు పరీక్ష ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త పరీక్షా వ్యవస్థకు సంబంధించిన ముసాయిదా విధానాన్ని CBSE అధికారిక వెబ్‌సైట్ https://www.cbse.gov.in/cbsenew/cbse.html అప్‌లోడ్ చేశారు. ఈ విధానాన్ని మరింత ప్రభావవంతంగా మార్చేందుకు ప్రభుత్వం మార్చి 9లోగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి సూచనలను కోరింది.
కొత్త పరీక్షా విధానం లక్ష్యం ఏంటి..
-
విద్యార్థులు మొదటి పరీక్షలో బాగా రాణించలేకపోయినా కూడా, రెండోసారి నిర్వహించే పరీక్షలో మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉంటుంది
-
దీంతోపాటు ఒకేసారి పరీక్ష రాయాలనే ఒత్తిడి కూడా విద్యార్థులకు తగ్గుతుంది. దీని ద్వారా విద్యార్థులు ఆత్మవిశ్వాసం పొందుతారు
-
విద్యార్థులు రెండు సార్లు పరీక్ష రాసే అవకాశం ఉంటుంది కాబట్టి, తమ బలహీనతలను గుర్తించుకోవడం ద్వారా తదుపరి పరీక్షలో మెరుగ్గా రాణించవచ్చు
కొత్త వ్యవస్థ ఎప్పటి నుంచి అమలవుతుంది..
ఈ కొత్త వ్యవస్థను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయవచ్చని భావిస్తున్నారు. ఈ మార్పు ద్వారా విద్యార్థులకు మేలు చేస్తుందని, విద్యా వ్యవస్థను మరింత సరళంగా మారుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. వచ్చే ఏడాది నుంచి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ CBSEతో చర్చలు జరిపింది.
ఈ క్రమంలో విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ భేటీ వివరాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతోపాటు ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి కూడా సలహాలను కోరుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఒత్తిడిలేని వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజల స్పందన తర్వాత విద్యా మంత్రిత్వ శాఖ ఈ విధానంలో మరిన్ని మార్పులు చేయనుందన్నారు.
ఇవి కూడా చదవండి:
Amit Shah: 2 రోజుల్లోనే రూ. 30,77,000 కోట్ల పెట్టుబడులు.. కేంద్ర హోమంత్రి అమిత్ షా ప్రశంసలు
Liquor Scam: లిక్కర్ స్కాం వల్ల ప్రభుత్వానికి 2 వేల కోట్లకుపైగా నష్టం..
Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Read More Business News and Latest Telugu News
Updated Date – Feb 25 , 2025 | 09:41 PM