పసిఫిక్‌లో అలకల్లోలం

పసిఫిక్‌లో అలకల్లోలం

బుధవారం తెల్లవారుజామున తీవ్రాతి తీవ్ర భారీ భూకంపం రష్యాను కుదిపేసింది. రష్యా దూర ప్రాచ్య ప్రాంతంలో ఇంతకు ముందెన్నడూ చవిచూడని రీతిలో ఈ భూకంప తీవ్రత ఉంది. ఇది తన ప్రభావాన్ని బహుదూరం వరకూ విస్తారితం చేసింది. రెక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో జపాన్, అమెరికాలోని ద్వీపరాష్ట్రం హవాయ్, అమెరికా పశ్చిమ తీరంలో సునామీ భీకర అలలు తలెత్తాయి. ఇప్పటివరకూ ఈ భూకంపం , తరువాత సునామీతో భారీ స్థాయి నష్టం ఏదీ జరగలేదు. … Read more

India-US trade deal: మోడీకి ట్రంప్ జిగ్రీ దోస్త్.. అయినా ఏం ఫాయిదా?

India-US trade deal: మోడీకి ట్రంప్ జిగ్రీ దోస్త్.. అయినా ఏం ఫాయిదా?

India-US trade deal: పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట.. అలా ఉంది మన ట్రంప్ పరిస్థితి. అమెరికన్లు తమ తలరాత మారుస్తాడు.. తమకు ఉద్యోగాలిస్తాడు.. భవిష్యత్తును బాగు చేస్తాడని ఊహిస్తే.. ట్రెయిన్ అంతా రివర్స్ అయిపోయింది. ట్రంప్ విదేశాలపై సుంకాలు వేస్తూ వాటిని అమెరికాలోకి రాకుండా చేసి చివరకు అమెరికన్లకే ‘భారాన్ని’ మోపుతున్నాడు. ధరలు పెరిగి అమెరికన్లు తిండికి బట్టకు, జీవించడానికి నానా ఇబ్బందులు పడేలా చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు వేసిన ట్రంప్ … Read more

World Malayali Council: నేపాల్‌ మంత్రిని కలిసిన వరల్డ్ మలయాళీ కౌన్సిల్ సభ్యులు.. మలయాళీల సంక్షేమం, అభివృద్ధిపై చర్చ – Telugu News | World Malayali Council Strengthens Ties in Nepal

World Malayali Council: నేపాల్‌ మంత్రిని కలిసిన వరల్డ్ మలయాళీ కౌన్సిల్ సభ్యులు.. మలయాళీల సంక్షేమం, అభివృద్ధిపై చర్చ – Telugu News | World Malayali Council Strengthens Ties in Nepal

ప్రపంచవ్యాప్తంగా మలయాళీల అభ్యున్నతిని ప్రోత్సహించడమే లక్ష్యంగా వరల్డ్ మలయాళీ కౌన్సిల్ పనిచేస్తోంది. ఇది మలయాళీల ఐక్యత పెంపొందించడంతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహిస్తోంది. వరల్డ్ మలయాళీ కౌన్సిల్ సభ్యులు ఇటీవలే నేపాల్‌లో పర్యటించారు. సంబంధాల బలోపేతంతో పాటు అభివృద్ధి అవకాశాలను అన్వేషించడానికి నేపాల్‌‌లో పర్యటించారు. గ్లోబల్ ప్రెసిడెంట్ డాక్టర్ బాబు స్టీఫెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నేపాల్ వాణిజ్య,  పరిశ్రమల మంత్రి దామోదర్ భండారిని కలిశారు. పలు కీలక అంశాలపై చర్చించారు. నేపాల్‌లో వరల్డ్ మలయాళీ కౌన్సిల్ … Read more

నేటితో ముగియ‌నున్న ప్ర‌తీకార సుంకాల గడువు

నేటితో ముగియ‌నున్న ప్ర‌తీకార సుంకాల గడువు

– Advertisement – న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో రంకెలెసిన డొనాల్డ్ ట్రంప్..ప్ర‌పంచ దేశాల‌పై ప్ర‌తీకార సుంకాల‌తో క‌దంతొక్కారు. యూఎస్ ఉత్ప‌త్తుల‌పై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్నార‌ని, అంతే స్థాయిలో ఆయా దేశాల దిగుమ‌తుల‌పై తాము కూడా ప‌న్నులు విధిస్తామ‌ని ట్రంప్ ట్రేడ్ వార్ కు తెర‌లేపారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న అమెరికా విమోచ‌న దినంతో వివిధ దేశాల‌పై విధించిన టారిఫ్‌ల చిట్టాలను బ‌హిర్గతం చేశారు. దీంతో చైనా, కెన‌డా, యూరోపియ‌న్ తో పాటు … Read more

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారుల్లో అత్యధికం భారతీయులే…: ఐక్యరాజ్యసమితి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారుల్లో అత్యధికం భారతీయులే…: ఐక్యరాజ్యసమితి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారుల్లో అత్యధికం భారతీయులే అని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2024 నాటికి వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 1.85 కోట్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నట్టు, ఇది ప్రపంచ వలసదారుల్లో 6 శాతం అని పేర్కొంది. ఇక‌, ప్ర‌పంచ‌వ్యాప్తంగా 30.4 కోట్ల మంది అంతర్జాతీయ వలసదారులు ఉన్నార‌ని తెలిపింది. 2020లో ఈ సంఖ్య 27.5 కోట్లుగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. అంతర్జాతీయ వలసల్లో 1.85 కోట్ల మంది ప్రవాసుల‌తో భార‌త్‌ అగ్రస్థానంలో ఉంటే.. ఆ తర్వాత చైనా (1.17 కోట్లు), మెక్సికో … Read more

25శాతం సుంకాలు

25శాతం సుంకాలు

రష్యాతో లావాదేవీల నేపథ్యంలో అదనంగా పెనాల్టీ విధింపు భారత్ వైఖరిలో మార్పు లేనందునే నిర్ణయం అత్యధికంగా సుంకాలు విధిస్తున్న దేశాల్లో ఒకటని అమెరికా అధ్యక్షుడి ధ్వజం ట్రంప్ నిర్ణయంపై భారత్ తక్షణ సమీక్ష కేంద్రమంత్రులు జైశంకర్, పీయూష్ గోయల్ భేటీ ఉన్నతాధికారులతో సమీక్ష భారత్ మాకు మిత్రదేశమే. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో అది కూడా ఒకటి. వాణిజ్యపరంగా ఏ దేశంతో లేని అడ్డంకులు భారత్‌తో ఉన్నాయి. పైగా రష్యా నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు … Read more

US global dominance: అమెరికాకు సుంకాలు విధించడం కొత్త కాదు.. లక్షల కోట్లతో ఇదిగో ఇలాంటి వ్యవస్థలను నిర్మించింది

US global dominance: అమెరికాకు సుంకాలు విధించడం కొత్త కాదు.. లక్షల కోట్లతో ఇదిగో ఇలాంటి వ్యవస్థలను నిర్మించింది

US global dominance: రక్షణ రంగంలో నెంబర్ వన్.. ఆయుధాల తయారీలో నెంబర్ వన్.. శాస్త్ర సాంకేతిక రంగాలలో నెంబర్ వన్.. తయారీ రంగంలో నెంబర్ వన్.. అప్పుల్లో కూడా నెంబర్ వన్.. ప్రపంచ మారకంలో నెంబర్ వన్.. వర్తకంలో, వాణిజ్యంలో నెంబర్ వన్.. అందువల్లే అమెరికా ప్రపంచాన్ని శాసిస్తుంది. ప్రపంచాన్ని కనుసైగతో వణికిస్తుంది. అందువల్లే అమెరికా అంటే ప్రపంచం మొత్తం భయపడుతుంది. అమెరికా ముందు తలవంచుతుంది.. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికా ప్రపంచం మీద సాగించే … Read more

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌లో సాంకేతిక సమస్య.. బ్రిటన్ ఎయిర్ బేస్ మూసివేత..ప్రయాణికుల ఇబ్బందులు – Telugu News | UK Air Traffic Control Glitch NATS System Failure Causes Flight Chaos

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌లో సాంకేతిక సమస్య.. బ్రిటన్ ఎయిర్ బేస్ మూసివేత..ప్రయాణికుల ఇబ్బందులు – Telugu News | UK Air Traffic Control Glitch NATS System Failure Causes Flight Chaos

బ్రిటన్‌లో నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్‌ (NATS) సాంకేతిక సమస్యతో ఎయిర్ బేస్ మూసివేయడం కలకలం రేపింది. ఈ తాత్కాలిక గ్లిచ్‌తో బ్రిటన్ నుంచి బయలుదేరే అన్ని విమానాలు నిలిచిపోయాయి. లండన్‌లోని ఆరు ప్రధాన విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. స్వాన్విక్ ATC సెంటర్‌లో వ్యవస్థ వైఫల్యం కారణంగా ఏర్పడిన అంతరాయం ఫలితంగా బర్మింగ్‌హామ్, ఎడిన్‌బర్గ్‌తో సహా అనేక UK విమానాశ్రయాలలో విమానాలు రద్దు చేయబడ్డాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తక్కువ సమయంలోనే ఇంజనీర్లు … Read more

మ‌రో సుంకాల బాంబు పేల్చిన యూఎస్ ప్రెసిడెంట్

మ‌రో సుంకాల బాంబు పేల్చిన యూఎస్ ప్రెసిడెంట్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ మరింత దూకుడుగా టారిఫ్‌లను విధిస్తున్నారు. కాపర్‌ దిగుమతులపై 50శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్ట్‌ 1 నుండి సెమీ -ఫినిష్డ్‌ కాపర్‌, కాపర్‌ ఆధారిత ఉత్పత్తుల దిగుమతులపై 50శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు బుధవారం విడుదలైన వైట్‌ హౌస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ పేర్కొంది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే పరిస్థితుల్లో, పరిమాణంలో కాపర్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు ఈ ప్రకటన తెలిపింది. భారత్‌ 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు 360 మిలియన్‌ డాలర్ల … Read more

భారత్‌కు చెందిన ఆరు చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

భారత్‌కు చెందిన ఆరు చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

భారత్‌పై అమెరికా 25శాతం కస్టమ్స్‌ సుంకాలు విధింపు వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఇరాన్‌ చమురు ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌ చేయడం అనే కారణంతో, ప్రపంచవ్యాప్తంగా 20 కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు వాషింగ్టన్‌ ప్రకటించింది. ఈ సంస్థలలో భారత్‌కు చెందిన ఆరు కంపెనీలు కూడా ఉండటం గమనార్హం. అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. టెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు అమెరికా ఈ కఠిన నిర్ణయంఇరాన్‌ చమురు విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని … Read more