ఆ నోట్లపై నా వేలిముద్రలున్నాయా?..

ఆ నోట్లపై నా వేలిముద్రలున్నాయా?..

ఏపీ లిక్కర్ స్కామ్‌ నిందితుడు రాజ్ కసిరెడ్డి వాదనఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 12 మంది నిందితులకు రిమాండ్ పొడిగింపుకోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి APలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి (RAJ KASI REDDY)కోర్టులో కన్నీటిపర్యంతమయ్యారు. తనకు బెయిల్ రాకుండా సిట్ అధికారులు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో … Read more

తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల్లో మళ్లీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల్లో మళ్లీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ నగరంతో పాటు అన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి.నాలుగు నుంచి ఐదు రోజులపాటు ఎడతెరిపిలేకుండా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లో రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు రాకపోకల్లో అంతరాయం ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వర్షాలు కొంత తగ్గడంతో ప్రజలు, రైతులు తమ దైనందిన పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే … Read more

గత పాలన సైకో పాలన…

గత పాలన సైకో పాలన…

ఆర్థిక విధ్వంసం చేసి అందరినీ ఇబ్బంది పెట్టారువైసీపీ పాలనపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత పాలన సైకో పాలన.. ఆర్థిక విధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు పెన్షన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారని, ఎన్నికల ముందు రాక్షస పాలన చూశామని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఇబ్బందిపడుతూ పెన్షన్లు పెంచారని అయితే కూటమి పాలనలో ఒక్కసారే పెన్షన్లు పెంచామని ప్రజలకు … Read more

త్వరలో అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భూమిపూజ

త్వరలో అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి  భూమిపూజ

: బాలకృష్ణ జాతీయ అవార్డు రావడంపై బాలకృష్ణ హర్షం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ నెల 13న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బాలకృష్ణ, ఆయన సన్నిహితులు గాంధీ, సిద్ధాంతి నాగమల్లేశ్వరరావు శనివారం పరిశీలించారు.ఆసుపత్రి నిర్మాణ ప్రణాళికలను సీఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ బాలకృష్ణకు వివరించారు. మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. మూడు దశల్లో ఆసుపత్రి నిర్మాణం … Read more

జగన్‌కు కేజీకి, టన్నుకు తేడా తెలియదు…

జగన్‌కు కేజీకి, టన్నుకు తేడా తెలియదు…

జగన్‌పై తీవ్రంగా మండిపడిన హోంమంత్రి వంగలపూడి అనిత రైతుల విషయంలో రాజకీయం చేయరాదని.. రాజకీయం చేసేందుకు వైసీపీ నాయకులు వ్యవసాయాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత విమర్శించారు.మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనిత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పొగాకు రైతుల వద్దకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి కేజీకి, టన్నుకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. మామిడి రైతుల వద్దకు వెళ్లి మామిడి కాయలు తొక్కించిన ఘనత జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. … Read more

తెలుగు జాతి ముద్దు బిడ్డ పింగళి వెంకయ్య : వైఎస్‌.జగన్‌

తెలుగు జాతి ముద్దు బిడ్డ పింగళి వెంకయ్య : వైఎస్‌.జగన్‌

తెలుగు జాతి ముద్దు బిడ్డ పింగళి వెంకయ్య అని వైసిపి అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకొని వైఎస్‌.జగన్‌ నివాళులర్పించారు. జాతీయ జెండా రూపకర్త, తెలుగు జాతి ముద్దు బిడ్డ పింగళి వెంకయ్య గారు వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను అని ట్వీట్‌ చేశారు.

రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది..?

రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది..?

బిజెపి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల కాలంలో పరిపాలన గాడి తప్పింది. ఏపీ ప్రభుత్వం సంవత్సర కాలంలో 1.70 వేల కోట్ల అప్పు చేసింది. 146 కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని ట్రంప్ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ట్రంపు కు ప్రధానమంత్రి మోడీ సమాధానం ఇవ్వకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు.? దేశ ప్రజలకు సమాధానం ఇచ్చి తీరాలి. ఆంధ్ర ప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. విశాలాంధ్ర ధర్మవరం;; రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ … Read more

రెపరెపలాడిన ఎర్రజెండాలు

రెపరెపలాడిన ఎర్రజెండాలు

పట్టణంలో సిపిఐ రెండవ జిల్లా మహాసభలు ర్యాలీ పూలవర్షం కురిపించిన పట్టణ ప్రజలు విశాలాంధ్ర ధర్మవరం;; భారత కమ్యూనిస్టు పార్టీ రెండవ జిల్లా మహాసభలు ధర్మవరం పట్టణంలో అత్యంత వైభవంగా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ ర్యాలీలో సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, నియోజకవర్గ కార్యదర్శి మధు, జింక చలపతి, రవికుమార్, రమణ, వెంకటనారాయణ, జిల్లాలోని సిపిఐ మండల కార్యదర్శి, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలతో మార్మోగించారు. ఈ … Read more

ధర్మవరంలో వైభవంగా నిర్వహించనున్న చేనేత దినోత్సవం

ధర్మవరంలో వైభవంగా నిర్వహించనున్న చేనేత దినోత్సవం

చేనేత దినోత్సవానికి ఏర్పాట్లను పరిశీలించిన హరీష్ బాబు మంత్రి పర్యటన నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించిన హరీష్ బాబు.విశాలాంధ్ర ధర్మవరం; ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ధర్మవరం పట్టణంలోని కదిరి గేటు వద్ద ఘనంగా నిర్వహించనున్న చేనేత దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని, కార్యక్రమ స్థలంలోని ముందస్తు ఏర్పాట్లను హ్యాండ్లూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ తో … Read more

దోచుకున్నది దాచుకోవడానికే బాబు సింగపూర్‌ వెళ్తున్నారు: గుడివాడ

దోచుకున్నది దాచుకోవడానికే బాబు సింగపూర్‌ వెళ్తున్నారు: గుడివాడ

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌కు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. అమరావతిలో జరిగిన అవినీతిపై చర్చకు సిద్ధం ఉండాలని ఛాలెంజ్ చేశారు. విశాఖలో భూకేటాయింపులపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. 99 పైసలకు వందల కోట్ల భూములు కట్టబెడుతున్నారని, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు వేలకోట్ల భూములు అప్పగించారని దుయ్యబట్టారు. చంద్రబాబు లోక నాయకుడు కాదు లోక మాయకుడు అని ధ్వజమెత్తారు. దోచుకున్నది దాచుకోవడానికే చంద్రబాబు సింగపూర్‌ టూర్ వెళ్తున్నారని అమర్నాథ్ ఆరోపణలు … Read more