
జీడిపప్పు.. సాధారణంగా అందరికీ ఇష్టమైన చిరుతిండి. ఇవి నాలుకకు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. దీనిలోని పోషకాలు శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కానీ జీడిపప్పు తినడం వల్ల బరువు పెరుగుతారా లేదా తగ్గుతారా అనే విషయంలో చాలా మందికి గందరగోళం ఉంది. దీంతో చాలా మంది జీడిపప్పును ఆహారంలో తీసుకోరు. కాబట్టి జీడిపప్పు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారా? లేదా బరువు తగ్గుతున్నారా? అనే విషయాలు నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..
జీడిపప్పు ఎప్పుడు తినాలి?
జీడిపప్పు తినే విధానం చాలా ముఖ్యం. దీన్ని నేరుగా తినడానికి బదులుగా వేయించి లేదా ఉప్పుతో కలిపి తినడం వల్ల అదనపు కేలరీలు పెరుగుతాయి. బరువు పెరగాలనుకునే వారికి ఇది మంచిది. బరువు తగ్గాలనుకునేవారు దీన్ని మితంగా, ఉప్పు లేకుండా, వేయించకుండా తినాలి. రోజువారీ ఆహారంలో 4-5 జీడిపప్పులు తినడం వల్ల శరీరానికి అవసరమైన కొవ్వు లభిస్తుంది. కానీ మీరు రోజుకు 10-15 జీడిపప్పులు తీసుకుంటే మాత్రం శరీరంలో ఎక్కువ కేలరీలు పేరుకుపోతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు.
జీడిపప్పు తినడం వల్ల బరువు పెరుగుతారా లేక తగ్గుతారా?
మనం బరువు పెరుగుతామా లేదా తగ్గుతామా అనేది మనపై ఆధారపడి ఉంటుంది. అది మనం తినే సమయం, చేసే శారీరక శ్రమపై కూడా ఆధారపడి ఉంటుంది. వ్యాయామం చేయకుండా ఎక్కువ జీడిపప్పు తింటే బరువు పెరుగుతారు. అదేవిధంగా మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, జీడిపప్పును మితంగా తీసుకుంటే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించడం మర్చిపోవద్దు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.