గతంలో మనం వాడే నాణేలు సిల్వర్ కలర్ లో కనిపించేవి..కానీ ఇప్పుడు వస్తున్న 10రూపాయలు, 20 రూపాయల నాణాలు బంగారు రంగులో వస్తున్నాయి. ఈ నాణెం మధ్యలో వెండి రంగులో ఉండి, బార్డర్ చుట్టూరా గోల్డ్ కలర్ తో ఉంటుంది. అయితే, ఈ నాణేలను బంగారు వర్ణంతో ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించిరా..? ఎలాంటి లోహాలను కలిపితే నాణెలకు ఈ రంగు వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
మన దేశంలో నోట్లు, నాణేలు రెండూ ఉన్నాయి. ముఖ్యంగా భిన్నమైన నాణెం 10 రూపాయల కాయిన్. 10 రూపాయల నాణెం రెండు రంగులతో ఉంటుంది. ఇది బయట పసుపు రంగుతో, లోపల వెండి రంగులో తయారు చేస్తారు. అయితే, ఈ 10 రూపాయల నాణేలను తయారు చేయడానికి రెండు రకాల లోహాలను ఉపయోగిస్తారట. ఈ నాణేల లోపలి భాగం సాధారణ నాణేల మాదిరిగానే వెండి రంగులో తయారు చేస్తారు. కానీ, దాని చుట్టూరా ఉన్న రంగు చాలా అందంగా, బంగారం వన్నెతో మెరిసిపోయేలా ఉంటుంది.
10రూపాయల నాణెంలోని పసుపు భాగం అల్యూమినియం కాంస్యంతో తయారు చేస్తారట. ఇందులో 92 శాతం రాగి, 6 శాతం అల్యూమినియం ఉంటుందట.. 2 శాతం నికెల్ కూడా ఉంటుంది. ఈ 10రూపాయల కాయిన్ 7.71 గ్రాముల బరువు ఉంటుంది. బయటి వృత్తం 4.45 గ్రాములు, మధ్య భాగం 3.26 గ్రాములు ఉంటుంది. ఈ పది రూపాయల నాణెం మధ్య భాగం కుప్రోనికెల్ తో తయారు చేస్తుంటారు. దీన్ని తయారు చేయడానికి 5.54 ఖర్చు అవుతుందట.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..