Case in opposition to Thopudurthi: రాప్తాడు మాజీ ఎమ్మెల్యేపై కేసు ఫైల్.. కారణమిదే

Written by RAJU

Published on:

శ్రీ సత్యసాయి జిల్లా, ఏప్రిల్ 10: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై (Former MLA Thopudurthi Prakash Reddy) రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ కార్యకర్తల తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమెదు చేశారు. హెలీప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు సరిగా లేవని ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు. హెలీప్యాడ్ నిర్వహణ సరిగా లేదని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి డీఎస్పీ స్వయంగా చెప్పారు. అయితే హెలీప్యాడ్ దగ్గరకు కార్యకర్తలు అందరూ వెళ్లాల్సిందేనని తోపుదుర్తి పట్టుబట్టారు. డీఎస్పీతో హెలీప్యాడ్ వద్ద ప్రకాష్ రెడ్డి వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రకాష్ రెడ్డి కార్యకర్తలను రెచ్చగొట్టడంతోనే జగన్ హెలికాప్టర్‌లో వచ్చిన సమయంలో బారికేడ్లు తోసుకొని కార్యకర్తలు లోపలికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఆ సమయంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరుగగా.. ఇందులో కానిస్టేబుల్ నరేంద్ర కుమార్‌కు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభాకర్ రెడ్డిపై రామగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. హెలీప్యాడ్ దగ్గర సరైన బారికేడ్లు ఏర్పాటు చేయలేదని, నిర్వహణ సరిగా లేదని పలుమార్లు పోలీసులు చెప్పినా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పట్టించుకోకపోవడంతోనే కార్యకర్తలందరూ హెలికాప్టర్ దగ్గరికి దూసుకొచ్చారని పోలీసులు తెలిపారు. పోలీసులు హెలిపాడ్ నిర్వహణ సరిగా చేయకపోవడం, కార్యకర్తలను రెచ్చగొట్టి హెలిపాడ్ దగ్గరకు తీసుకెళ్లడం, పోలీసులతో వాగ్వాదానికి దిగిన కారణంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది.

కాగా.. రెండు రోజుల క్రితం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించిన జగన్.. ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అయితే జగన్‌ పర్యటన సందర్భంగా కుంటిమద్ది వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వందలాది మంది కార్యకర్తలు దూసుకురావడంతో తోపులాట చోటు చేసుకుంది. అయితే హెలీప్యాడ్ వద్ద జరిగిన తోపులాట మొత్తానికి కారకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తున్నాయి. ఈ క్రమంలో తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హెలీప్యాడ్ నిర్వాహణ సరిగా లేదని స్వయంగా డీఎస్పీ.. ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని పోలీసులు తెలిపారు.

వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడి ఒకేసారి వందలమంది హెలీప్యాడ్ వద్దకు వెళ్లేందుకు ప్రకాష్ రెడ్డి కారణమయ్యారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాష్ రెడ్డి వల్లే కుంటిమద్ది వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు వందల మంది కార్యకర్తలు దూసుకొచ్చారు. పాపిరెడ్డిగ్రామంలో కార్యకర్తలను పంపించాలని, హెలీప్యాడ్ వద్ద కొంతమందిని మాత్రమే ఉండాలని పోలీసులు చెప్పినప్పటికీ.. ప్రకాష్ రెడ్డి లెక్కచేయలేదు. అంతే కాకుండా పోలీసులపైకి కార్యకర్తలను ఉసిగొల్పారని, అందవల్లే పోలీసులను తోసుకొని మరీ కార్యకర్తలు హెలీప్యాడ్ వద్దకు వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. హెలిప్యాడ్ వద్ద ఘటనకు ప్రధాన కారణం ప్రకాష్ రెడ్డే అంటూ రామగిరి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

Kidney Stones: ఈ మొక్కతో కిడ్నీలో రాళ్లు కరిగిపోవాల్సిందే

YCP Political Tactics: తిట్టించు ఇరికించు

Read Latest AP News And Telugu News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights