Raw Carrots vs Cooked Carrots : క్యారెట్లు మార్కెట్లో ఎక్కువగా లభించే కూరగాయల్లో ఒకటి. ఇందులో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ, పోషకాలు అధికంగా ఉండే క్యారెట్లను రోజూ తినడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వివిధ ప్రమాదకరమైన వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. కానీ ఉడికించిన క్యారెట్లలో పచ్చి క్యారెట్ల కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయా?లేదా పచ్చిగా తింటే ప్రయోజనాలుంటాయా? ఏ రకమైన క్యారెట్లు తింటే మేలు అనేది ఇక్కడ తెలుసుకోండి..
క్యారెట్లలో కాల్షియం, ఇనుము, విటమిన్లు ఎ, బి, సి ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు, ఖనిజాలు, తేమ, ఫైబర్, పిండి పదార్థాలు కూడా ఉంటాయి. క్యారెట్లలో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం, క్యారెట్లలోని తీపి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యారెట్లను నమిలి తినడం వల్ల దంతాలు, నోరు శుభ్రపడతాయి. అదే సమయంలో ఇందులోని ఆల్కలీన్ రక్తాన్ని శుద్ధి చేసి మొత్తం శరీరానికి రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. దీనిలోని ఫైబర్ కంటెంట్ ప్రేగులను శుభ్రపరిచి శరీరంలోని వ్యర్థాలను వెళ్లగొడుతుంది. క్యారెట్లు పేగుల శ్లేష్మ పొరను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యారెట్లను క్రమం తప్పకుండా తింటే మలబద్దకాన్ని నివారిస్తుంది. పచ్చి క్యారెట్లలోని ఫైబర్, తదితర పోషకాలు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించి బరువు తగ్గడంలో సహాయపడతాయి.
ఉడికించిన క్యారెట్లు పచ్చి క్యారెట్ల కంటే మేలా..
క్యారెట్లలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. కంటి ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, చర్మానికి అవసరమైన పోషకం. దీన్ని మీ శరీరం విటమిన్ ఎగా మార్చుతుంది. ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు పచ్చి క్యారెట్లు తిన్నప్పుడు శరీరం బీటా-కెరోటిన్‌లో 3 నుండి 4 శాతం మాత్రమే గ్రహిస్తుంది. అయితే వండిన తర్వాత దాదాపు 40 శాతం పెరుగుతుంది. అందువల్ల, ఉడికించిన క్యారెట్లు తినడమే శ్రేయస్కరం. మరో విషయం ఏంటంటే, ఉడికించిన క్యారెట్లు కలుషితమైన అనారోగ్యాలు చుట్టుముడతాయి.
Read Also : పల్లీల్లో ఏముంది..
Diabetes: స్వీట్లు తిన్న తర్వాత మీ రక్తంలో చక్కెర పెరిగితే ఏం చేయాలి?
Heart Attacks at Young Age: యువతలో పెరుగుతున్న గుండెపోటు గుబులు.. ఎందుకిలా జరుగుతోంది..