ABN
, Publish Date – Mar 08 , 2025 | 03:50 PM
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఏజెంట్‍గా పని చేస్తున్నారు. బంధువుల ఇంటికి వెళ్లేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ (శనివారం) ఉదయం తన కారులో బయలుదేరాడు.

Car Accident
వరంగల్: సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కాకతీయ కెనాల్‍లో గల్లంతు కాగా.. ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో మహిళను స్థానికులు అతికష్టం మీద రక్షించి ప్రాణాలు కాపాడారు. కుటుంబసభ్యులు ప్రమాదానికి గురికావడంతో బాధితురాలు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఏజెంట్‍గా పని చేస్తున్నారు. బంధువుల ఇంటికి వెళ్లేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ (శనివారం) ఉదయం తన కారులో బయలుదేరాడు. అనితోపాటు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే అప్పటివరకూ సాఫీగా సాగిన వారి ప్రయాణం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వద్దకు రాగానే కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. స్థానికులు చూస్తుండగానే ఎస్సారెస్పీ కెనాల్‍లోకి కారు దూసుకెళ్లింది. దీంతో గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు.
ఈ మేరకు కాలువలోకి దిగిన స్థానికులు బాధిత కుటుంబాన్ని రక్షించే ప్రయత్నం చేశారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో వాహనం కొట్టుకుపోయింది. అతి కష్టం మీద ప్రవీణ్ భార్యను కాపాడగలిగారు. కాసేపటికే అక్కడికి చేరుకున్న గజఈతగాళ్లు ప్రవీణ్ కుమారుడి మృతదేహాన్ని వెలికి తీశారు. గల్లంతైన ప్రవీణ్, అతని కుమార్తె కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. కాగా, కుమారుడి మృతదేహాంపై పడి సదరు తల్లి విలపిస్తున్న తీరు చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు ప్రమాదానికి గురికావడంతో మేచరాజుపల్లిలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Jagtial wedding tragedy: 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు… చివరకు
Telangana MPs Meet: తెలంగాణ ఎంపీల సంచలన నిర్ణయం.. వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం..
Updated Date – Mar 08 , 2025 | 03:50 PM