– గతంలోనే అధికారిక ప్రకటన
– ప్రక్రియలో తీవ్ర జాప్యం
– జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలిసిన ఆర్మీ అధికారులు
– ఏఓసీ రోడ్ల భూసేకరణపై చర్చ
హైదరాబాద్ సిటీ: జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్ బోర్డు(Cantonment Board) విలీనంపై రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. విలీనానికి సంబంధించి గతంలోనే అధికారిక ప్రకటన వెలువడినా తదనంతర ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఆర్మీ అధికారులు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబరిదిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వార్తను కూడా చదవండి: Manjira water: లీకేజీల మంజీరా.. ఇలా అయితే వేసవిలో ఇక..
ఏఓసీ రహదారుల నిర్మాణం, భూసేకరణపై వారి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. విలీన ప్రతిపాదన నేపథ్యంలో భూసేకరణ చేయాలా, ఆస్తుల బదలాయింపు జరిగితే ఆ అవసరం ఉండదు కదా అన్న చర్చ రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాల్లో జరుగుతోంది. విలీనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలో కమిటీ వేసింది. డిఫెన్స్ ఎస్టేట్ డైరెక్టర్ జనరల్, మిలిటరీ అధికారులు, పురపాలక శాఖ కార్యదర్శి, బోర్డు అధ్యక్షుడు, సీఈఓ, ఆర్మీ సీనియర్ అధికారులతో కూడిన కమిటీ గతేడాది డిసెంబరులో సమావేశమయ్యారు. త్వరలో మరో దఫా సమావేశం ఉంటుందని సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోనూ కమిటీ సభ్యులు పలు అంశాలపై ఇంతకుముందు చర్చించారు.
అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన
జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రాంతాలతో పోలిస్తే బోర్డులోని ఏరియాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పూర్తిస్థాయిలో జరగలేదని స్థానికుల అభిప్రాయం. ఈ క్రమంలోనే బల్దియాలో విలీనం చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. భద్రతా కారణాల పేరిట ఏఓసీ, గాఫ్ రోడ్లు మూసివేస్తుండడంతో కుషాయిగూడ, నేరేడ్‌మెట్, మల్కాజ్‌గిరి ప్రాంతాలకు వెళ్లే పౌరులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గతంలో సర్కారు రక్షణ శాఖను కోరింది. ఇందుకు అవసరమైన 36 ఎకరాల భూమి ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు.
చట్టప్రకారం పరిహారం లేదా అంతే విలువైన భూమి మరో ప్రాంతంలో కేటాయించాలని బోర్డు పేర్కొంది. దీంతో రహదారుల నిర్మాణం పక్కన పెట్టారు. విలీనమైతే బోర్డు ఆస్తులూ స్థానిక సంస్థ (జీహెచ్‌ఎంసీ)కు బదలాయించాల్సి ఉంటుంది. అయితే రక్షణ శాఖకు చెందిన భూముల బదలాయింపుపై కేంద్రంలోని కొందరు సీనియర్ అధికారులు అభ్యంతరం చెబుతున్నట్టు సమాచారం. దాదాపు 4 వేల ఎకరాలకు పైగా స్థలాలు ఉండడం, వాటి విలువ రూ.వేల కోట్లలో ఉండడం విలీనంలో జాప్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇదిలాఉంటే.. 2021లో బోర్డు పాలకమండలి గడు వు ముగిసింది. తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు. బోర్డు అధ్యక్షుడు, సీఈఓ, రక్షణ శాఖ అధికారులు, నామినేటెడ్ సభ్యుడితో కూడిన బాడీ ఆధ్వర్యంలో బోర్డు నిర్వహణ ప్రస్తుతం కొనసాగుతోంది.
ఈ వార్తలను కూడా చదవండి:
Harish Rao: సీఎం రేవంత్ రాజీనామా చేయాలి
కాళేశ్వరం నీరందకనే ఎండుతున్న పంటలు
Farmers: పంటతడి.. కంటతడి!
కేసీఆర్‌తో భేటీలో ఆ విషయం మాట్లాడు.. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్
Read Latest Telangana News and National News
Updated Date – Mar 11 , 2025 | 11:30 AM